C.Kalyan : సినీ పరిశ్రమని చంపొద్దంటూ నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలు

స్టార్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ చిన్నదే అయినా కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి.....

C.Kalyan : సినీ పరిశ్రమని చంపొద్దంటూ నిర్మాత సి.కళ్యాణ్ వ్యాఖ్యలు

Kalyan

C.Kalyan : ఏపీలో సినీ పరిశ్రమ, థియేటర్స్ సమస్యలపై కొన్ని రోజులుగా చర్చలు నడిచాయి. సినీ పెద్దలు ఏపీ సీఎం, మంత్రులని కలిసి వారి సమస్యలని వినిపించారు. అయినా సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ తన తీరు మార్చలేదు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమకి, థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి తప్ప, ఎవరికీ లాభం చేకూర్చేలా లేవు. ఇటీవల సినీ నియంత్రణ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు ఉండవని, టికెట్ రేట్లు భారీగా తగ్గించమని తెలిపారు. ఇది సినీ పరిశ్రమకి భారీ నష్టమే.

Bigg Boss Priyanka : బిగ్‌బాస్‌ లో ప్రియాంక రెమ్యునరేషన్ ఎంత??

దీనిపై సినీ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. చాలా వరకు సినీ పెద్దలు ఆన్లైన్ టికెటింగ్ ని స్వాగతించినా టికెట్ రేట్లు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికే సురేష్ బాబు లాంటి కొంతమంది నిర్మాతలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించారు. తాజాగా మరో స్టార్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.

Akhanda : ‘అఖండ’ సీక్వెల్ ప్లాన్.. స్టోరీ ఇదేనా??

నిన్న సి.కళ్యాణ్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ చిన్నదే అయినా కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఈ రంగానికి ఉంది. లక్షలాది మంది ఈ రంగాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో టికెట్‌ రేట్లు తగ్గించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. సినీ రంగాన్ని చంపొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని వ్యాఖ్యానించారు.

Pushpa : ‘పుష్ప’ టీం మెంబర్స్‌కి గోల్డ్‌రింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఐకాన్ స్టార్

అలాగే.. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని అమలు చేయమని ఏపీ ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ పెద్దలు కోరారు. దీనిపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరిపిన చర్చలను కొందరు వక్రీకరించడం అపార్థాలకు దారితీసిందని, ప్రస్తుతం కలెక్షన్స్‌, కాంబినేషన్స్‌కు మాత్రమే ఇండస్ట్రీలో విలువ ఉందని, సినిమా రూపకల్పన విషయంలో ఇప్పుడు వచ్చే నిర్మాతలకు సరైన అవగాహన ఉండటం లేదన్నారు.

Bigg Boss Sohel : బిగ్‌బాస్ సోహెల్‌తో ‘వకీల్‌సాబ్’ భామ

అంతేకాక బాలకృష్ణతో మళ్లీ సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన కలల ప్రాజెక్ట్‌ ‘రామానుజాచార్య’ను మా బ్యానర్‌లో చేయాలన్నదే నా కోరిక అని తెలిపారు. గతంలో కొన్ని బాలకృష్ణ సినిమాలకి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో కల్యాణ్‌ ఎమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను నిర్మిస్తున్నాని కూడా తెలిపారు.