రీమేక్ అనగానే దిల్ రాజుకి మెంటల్ అనుకున్నారు – ట్రెండింగ్‌లో ‘జాను’ ట్రైలర్..

‘జాను’ మూవీ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్‌తో ప్రేమలో పడతారు..

  • Published By: sekhar ,Published On : January 30, 2020 / 05:06 AM IST
రీమేక్ అనగానే దిల్ రాజుకి మెంటల్ అనుకున్నారు – ట్రెండింగ్‌లో ‘జాను’ ట్రైలర్..

‘జాను’ మూవీ చూశాక అమ్మాయిలు శర్వాతో, అబ్బాయిలు సామ్‌తో ప్రేమలో పడతారు..

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘జాను’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ యువతను బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతుంది.

Image

బుధవారం జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ : ‘‘నా పదిహేడేళ్ల కెరీర్‌లో తొలి రీమేక్‌ ‘జాను’. తమిళ చిత్రం ’96’కు ఇది రీమేక్‌. ఎప్పుడైనా రీమేక్‌ చేయాలంటే ఏముంటుందిలే అనుకునేవాడిని. అలా అంతకు ముందు రెండు సినిమాలు రీమేక్‌ చేద్దామనుకుని మిస్‌ అయ్యాను. ’96’ సినిమాను తమిళంలో రిలీజ్‌ కంటే ఓ నెల ముందే చూశాను. ప్రివ్యూ థియేటర్‌ నుండి బయటకు రాగానే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాను. ఈ సినిమాకు శర్వానంద్‌, సమంత ఫైనల్‌ కాకముందు చాలా చాలా అనుకున్నాను. ఆ సమయంలో చాలా కామెంట్స్‌ వినిపించాయి. వీళ్లకేమైనా పిచ్చా? అదొక క్లాసిక్‌ మూవీ. దిల్‌ రాజుకేమైనా మెంటలా? ఎందుకు రీమేక్‌ చేస్తున్నాడు? అని చాలా కామెంట్స్‌ వచ్చాయి. నాకు అర్థం కాలేదు. ఒక ఆడియన్‌గా నేను సినిమా చూశాను. తమిళం నాకు పూర్తిగా రాదు.

Read Also : సినిమా ఇండస్ట్రీతో ‘కమిట్‌మెంట్’..

Image

అయినా కూడా పాత్రలతో నేను ట్రావెల్‌ అయ్యి.. సినిమాకు ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను. నేను ఏదైతే ఆరోజు నమ్మానో.. ఈరోజు కూడా అదే నమ్ముతున్నాను. సామ్‌ సినిమా చూసి ఒరిజినల్‌ డైరెక్టర్‌ అయితేనే సినిమా చేస్తానని అంది. చివరకు నేను ఒరిజినల్‌ డైరెక్టర్‌నే తెచ్చాను. సమంత నన్ను కలిసినప్పుడు నాపై నమ్మకంతో సినిమా చేయమని చెప్పాను. తను ఓకే అంది. రెండు రోజుల తర్వాత తనే ఫోన్‌ చేసి నాకు థ్యాంక్స్‌ చెప్పడమే కాదు.. మ్యాజిక్‌ను ప్రతిరోజూ ఎంజాయ్‌ చేస్తున్నానని చెప్పింది. శర్వానంద్‌ కూడా సినిమా చూసి బ్యూటిఫుల్‌.. మూవీ చేస్తానని నాకు ఫోన్‌ చేశాడు. అలా శర్వా, సామ్‌ ఈ సినిమాలోకి వచ్చారు.

Image

తమిళ సినిమాను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌, టెక్నీషియన్స్‌ అందరూ ఈ సినిమాకు వర్క్‌ చేశారు. ఫిబ్రవరి 7న తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఏదైతే ఫీలింగ్‌తో ఉన్నానో.. రేపు సినిమా చూసి ప్రేక్షకులు అదే ఫీలింగ్‌ నిజమని నమ్ముతారు. అమ్మాయిలైతే శర్వాతో ప్రేమలో పడితే.. అబ్బాయిలు సామ్‌తో లవ్‌లో పడతారు. అలాంటి సోల్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ. అహా! అలాంటి లవర్‌ మనకుంటే బాగుండు అనే ఈర్ష్యతోనే లవ్‌లో పడతారు’’ అన్నారు.