Posani Krishna Murali : పోసాని పై విరుచుకుపడ్డ జెంటిల్మెన్ సినిమా నిర్మాత

2010లో పోసాని హీరోగా 'పోసాని జెంటిల్ మెన్' అనే సినిమాను తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఇవాళ పోసాని పై విమర్శలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు.

Posani Krishna Murali : పోసాని పై విరుచుకుపడ్డ జెంటిల్మెన్ సినిమా నిర్మాత

Posani Krishna

Posani Krishna Murali :  పవన్ కళ్యాణ్ స్పీచ్ కి ధీటుగా నిన్న పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ అసభ్యకరమైన మెసేజ్ లతో, కాల్స్ తో పోసానిని ఇబ్బంది పెట్టడంతో ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ పై , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు పోసాని పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నిర్మాత పోసానిని దారుణంగా విమర్శించారు.

2010లో పోసాని హీరోగా ‘పోసాని జెంటిల్ మెన్’ అనే సినిమాను తీసిన నిర్మాత నల్లం శ్రీనివాస్ ఇవాళ పోసాని పై విమర్శలు చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు. పోసాని చేసిన మెంటల్ క్రిష్ణ, రాజా వారి చేపల చెరువు సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ చేసాను అని అయితే ఆ సినిమాలకి చాలా నష్టం వచ్చిందని తెలిపాడు. అప్పట్లో చిరంజీవి వద్ద విశ్వాసంతో ఉన్నాడనే ఉద్దేశంతో మంచి సినిమా తీయమని ప్రొడ్యూస్ చేస్తాను అని నమ్మి అడిగితే ఒక బి గ్రేడ్ సినిమా తీసి చేతిలో పెట్టారని, నన్ను దారుణంగా మోసం చేసాడని ఆరోపించారు.

Posani Krishnamurali : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి నాకు ప్రాణ భయం ఉంది: పోసాని

పోసానిని తాను నమ్మి తప్పు చేశాను. నా జీవితంలో ఏ రోజు ఇలా వీడియో తీయాలి అని అనుకోలేదని కానీ రెండు రోజుల నుంచి పోసాని ఇష్టమొచ్చినట్టు వాగుతున్నాడు అందుకే ఈ వీడియో చేశానని తెలిపాడు. అమ్మాయిల గురించి మాట్లాడే పోసాని తన సినిమా టైంలో ఎంత మంది అమ్మాయిల విషయంలో పోసాని ఏం చేశారో నాకు తెలుసు అని అన్నారు. పోసాని మాటలు అన్ని అబద్దాలేనని, పోసానికి నీతి లేదని, అలాంటి విశ్వాసఘాతకుడు ఇంకెవరూ ఉండరని అన్నారు.

పవన్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడే హక్కు పోసానికి లేదని మండిపడ్డారు. రోజుకు 3 నుంచి 5 లక్షలు తీసుకునే పోసాని పవన్ రెమ్యునరేషన్ గురించి ఎలా మాట్లాడతాడు అని అడిగారు. సినిమా వ్యక్తి అయి ఉండి సినిమా వాళ్ల కోసం పవన్ మాట్లాడితే ఆయనపై దారుణంగా విమర్శలు చేయడం చాలా తప్పు అని, పోసాని ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 50వేల రూపాయలని విరాళంగా ఇచ్చానని, నేను నిర్మాతగా తీసిన సినిమా సమయంలో ఆయన ఇంటి వద్ద వాచ్ మెన్ డ్యూటీ చేశానని తెలిపారు అలాంటి పోసాని ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా అంటూ ఆ నిర్మాత ఫైర్ అయ్యారు.