Suriya : సూర్యతో మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

తమిళ హీరో సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవలే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ నటుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా సూర్య గతంలో దర్శకుడు వెట్రిమారన్‌తో ఒక సినిమా ప్రకటించాడు. 'వాడివాసల్' అనే టైటిల్ ని పెట్టుకోగా అందుకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Suriya : సూర్యతో మూవీ ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Producer gave clarity on suriya movie Vaadivaasal

Suriya : తమిళ హీరో సూర్య వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవలే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న ఈ నటుడు ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కాగా సూర్య గతంలో దర్శకుడు వెట్రిమారన్‌తో ఒక సినిమా ప్రకటించాడు. ‘వాడివాసల్’ అనే టైటిల్ ని పెట్టుకోగా అందుకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.

Suriya : డైరెక్టర్ బాల సినిమా నుంచి తప్పుకున్న సూర్య.. ఆగిపోయిన సినిమా.. పాపం కృతిశెట్టి..

దర్శకుడు వెట్రిమారన్ ప్రస్తుతం ‘విడుదలై’ అనే క్రైమ్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. విజయ్ సేతుపతి, సూరి ఇద్దరు కలిసి నటిస్తున్న ముల్టీస్టార్రర్ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. దీంతో సూర్య సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఆగిపోయింది అంటూ కథనాలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన ‘వాడివాసల్’ నిర్మాత.. “అవన్నీ అవాస్తవాలు అని కొట్టిపారేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది” అంటూ వివరణ ఇచ్చాడు.

కాగా సూర్య ప్రెజెంట్ మాస్ డైరెక్టర్ శివతో కలిసి ఒక పీరియాడికల్ డ్రామాని తెరకెక్కిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ‘దిశాపటా’ని హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరిలో అంచనాలు పెంచేసింది.