ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌‌లో సందీప్ హ్యాట్రిక్ చిత్రం

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన జెమిని కిరణ్..

  • Published By: sekhar ,Published On : May 7, 2020 / 11:48 AM IST
ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌‌లో సందీప్ హ్యాట్రిక్ చిత్రం

సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన జెమిని కిరణ్..

యంగ్ హీరో సందీప్ కిష‌న్ పుట్టిన‌రోజు (మే 7) సందర్భంగా.. నిర్మాత జెమిని కిర‌ణ్ త‌న ప్ర‌తిష్టాత్మ‌క బ్యాన‌ర్ ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్‌పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్: 15గా సందీప్ కిష‌న్‌తో ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. సందీప్ కిష‌న్‌తో ఈ బ్యాన‌ర్‌ది స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌. ఇదివ‌ర‌కు ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’‌, ‘బీరువా’ వంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి.

రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించనున్న ఈ చిత్రానికి భాను బోగ‌వ‌ర‌పు క‌థ అందిస్తున్నారు. ఈ చిత్రం బ్యూటిఫుల్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుందని చెబుతున్నారు. ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయి. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ నిర్మించే చిత్రంలో సందీప్ న‌టించ‌నున్నాడు.

Also Read | ఎన్నాళ్లో వేచిన ఉదయం.. దుల్కర్ తెలుగు సినిమా..