Oscars2023: ఆస్కార్ విన్నర్స్‌కు సన్మానం గొప్పగా చేయాలి – కెఎస్ రామారావు

ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు. వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Oscars2023: ఆస్కార్ విన్నర్స్‌కు సన్మానం గొప్పగా చేయాలి – కెఎస్ రామారావు

Producer KS Ramarao Demands Huge Felicitation For Oscars2023 Winner

Oscars2023: వరల్డ్ ఫేమస్ ఆస్కార్ అవార్డును అందుకుని ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా చరిత్రలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో మనం చూశాం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఈ ప్రెస్టీజియస్ అవార్డును అందుకోవడంతో యావత్ ఇండియా ఆర్ఆర్ఆర్ టీమ్ కు సెల్యూట్ కొట్టారు. ఇక తెలుగు ప్రేక్షకులు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి, చంద్రబోస్ లకు ప్రతిచోటా నీరాజనాలు పలుకుతున్నారు.

Oscars 2023 : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్కార్ అఫీషియల్ ఫాలో అయ్యేది ఆ ఇద్దరి ఇండియన్ హీరోలనే..

వారికి అన్ని రంగాల వారు సన్మానాలు చేస్తూ గౌరవిస్తున్నారు. అయితే, తాజాగా వారికి జరుగుతున్న సన్మానాలపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కెఎస్.రామారావు తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆస్కార్ అవార్డులు అనేవి చాలా ప్రతిష్టాత్మకమైనవి.. అలాంటి అరుదైన అవార్డులను అందుకున్న వారిని ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని.. వారికి ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కేవలం స్పోర్ట్స్ లో గెలిచిన వారికే మర్యాదలు, గుర్తింపులు ఇస్తారా.. సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అవార్డులను అందుకుంటే వారిని గుర్తించరా.. ఇప్పటికైనా ఆస్కార్ విన్నర్స్ ను మనం గొప్పగా సన్మానించాలి..’’ అని అన్నారు.

Chandrabose : ఆస్కార్ విజేత చంద్రబోస్‌కు సత్కారం.. రవీంద్రభారతిలో తెలంగాణ మంత్రి చేతుల మీదుగా..

ఫిల్మ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ శక్తిమేర ఆస్కార్ విజేతలను సన్మానించేందుకు ఏర్పాట్లు చేసినా అవేవీ సరిపోవని, యావత్ భారతదేశం గర్వించేలా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వేడుకలు జరపాలని కె.ఎస్.రామారావు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు రేపు(ఏప్రిల్ 9న) శిల్పకళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో చంద్రబోస్, కీరవాణిలకు గౌరవ సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.