Natti Kumar : సినిమా థియేటర్లు, ఫిలిం ఛాంబర్ వివాదంపై నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

ఏపీ థియేటర్లు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫిలిం ఛాంబర్ విషయాలపై నిర్మాత నట్టి కుమార్ ప్రెస్ మీట్..

Natti Kumar : సినిమా థియేటర్లు, ఫిలిం ఛాంబర్ వివాదంపై నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్

Natti Kumar

Natti Kumar: ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై సెన్షేషనల్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

‘‘థియేటర్స్ రీ ఓపెన్‌కు అవకాశం ఇచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. Go 35 క్యాన్సల్‌కు వైజాగ్ ఎగ్జిబిటర్స్ ఎవరూ వెళ్ళలేదు.. 224 మందికి తెలియకుండా కొంత మంది కోర్టుకు వెళ్లి కంప్లైంట్ చేశారు.. అసలు విషయం తెలుసుకునేందుకు విచారణకు అదేశాలు ఇవ్వాలని కోరుతున్నా.. టాప్ 3 లో ఉన్న వ్యక్తి దీని వెనుక వున్నాడు.. ఈ విషయం ప్రభుత్వం కు తెలుసు. 15 రోజుల్లో ఆర్డర్ పాస్ చేయండి..

Natti Kumar : పెంచిన టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తా – నట్టి కుమార్..

AP ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో పూసలు బాబ్జీ పై కంప్లైంట్ చేస్తే నా మీదనే యాక్షన్ తీసుకోవాలని ఛాంబర్ ప్రతినిధులు అనుకుంటున్నారు. వెంటనే ఛాంబర్ ఎన్నికలు పెట్టాలి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ రెండుగా విభజన చేయాలి. మా ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఆర్. నారాయణ మూర్తి, నేను కలసి సమస్య పరిష్కారం కోసం పని చేసాం. పది రోజుల్లో ఎన్నికలు పెట్టాలి, ఆంద్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ మాత్రమే ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్, చిన్న సినిమాలను కాపాడండి, పెద్ద సినిమాలు మాత్రమే బాగుపడుతున్నాయి. చిన్న సినిమాలకు 5వ షో కి పర్మిషన్ ఇవ్వండి.

Pushpa Movie : రెండో వారంలోనూ రచ్చ లేపాడు.. 200 కోట్ల క్లబ్‌లోకి దగ్గర్లో..

తెలంగాణలో చిన్న సినిమాలు రిలీజ్ చేయటం చాలా కష్టం.. నేను నా సినిమాలు తెలంగాణలో రిలీజ్ చేయను. హీరోలకు హీరోయిన్‌లకు బాడీ గార్డ్‌గా చేసేవాడు నా మీద అవాకులు, చెవాకులు మాట్లాడాడు. అలాంటి బ్రోకర్‌కి నేను వార్నింగ్ ఇస్తున్నా.. సీపీఐ నారాయణ మాటలు చూసి ఆశ్చర్య వేసింది. కమ్యూనిస్ట్ పార్టీ అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరికి వత్తాసు పలుకుతున్నాడు?.. అన్నారు.

Raavanasura : రవితేజ పక్కన ఫిక్స్ అయ్యారంటగా..

అలాగే మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ మీద ఫైర్ అయ్యారు నట్టి కుమార్.. ‘‘ఏపీకి ప్రత్యేక ఫిల్మ్ ఛాంబర్ ఉంటే తప్పు ఏమిటి? ఏపీ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సమస్యలు ఎవరు పరిష్కరించాలి? ఎన్వీ ప్రసాద్ చరిత్ర త్వరలో బయట పెడతా. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చింది, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు వచ్చాయి.. అన్నీ విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ లేకపోవడం ఏంటి?’’ అని ప్రశ్నించారు నట్టి కుమార్..