Bholaashankar: భోళాశంకర్ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండటంతో, ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లాస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోవడంతో ‘భోళాశంకర్’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Bholaashankar: భోళాశంకర్ నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..!

Producer Of Bholaashankar Gives Solid Update

Bholaashankar: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళాశంకర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండటంతో, ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి లాస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకోవడంతో ‘భోళాశంకర్’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Bhola Shankar : భారీ కలకత్తా సెట్‌లో మొదలుపెట్టేసిన భోళాశంకర్.. వాల్తేరు వీరయ్య రిటర్న్ టు సెట్స్..

ఇక ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా, ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ మెగా ఫ్యాన్స్ మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత అనిల్ సుంకర ‘భోళాశంకర్’ మూవీ గురించి ఓ అదిరిపోయే అప్డేట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోందని.. ఈ పాటకు కాసర్ల శ్యామ్ అద్భుతమైన లిరిక్స్ అందించాడని.. మహతిస్వర సాగర్ తన మ్యూజిక్‌తో ఈ పాటను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడని ఆయన అన్నారు.

ఈ పాటతో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం ఖాయమని.. ఈ సాంగ్‌లో మెగాస్టార్ వేసే స్టెప్స్ థియేటర్లలో ప్రేక్షకులతో చిందులు వేయించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, అందాల భామ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.