మా సినిమా మొత్తం మూతిముద్దులే.. హీరోకి బెస్ట్ లిప్ కిస్సర్ అవార్డ్ ఇవ్వొచ్చు..

‘ప్రేమపిపాసి’ చిత్రం గురించి సంచలన విషయాలు వెల్లడించిన నిర్మాత రామకృష్ణ..

  • Published By: sekhar ,Published On : March 10, 2020 / 12:03 PM IST
మా సినిమా మొత్తం మూతిముద్దులే.. హీరోకి బెస్ట్ లిప్ కిస్సర్ అవార్డ్ ఇవ్వొచ్చు..

‘ప్రేమపిపాసి’ చిత్రం గురించి సంచలన విషయాలు వెల్లడించిన నిర్మాత రామకృష్ణ..

బోల్డ్ కంటెంట్, ఇంటిమేట్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్.. వీటితో ట్రైలర్ కట్ చేసి, యూత్‌ని థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అదేకోవలో తెరకెక్కిన సినిమా ‘ప్రేమపిపాసి’ (Searching for True Love).. జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.

మురళీ రామస్వామి దర్శకత్వంలో పి.ఎస్.రామకృష్ణ (ఆర్కే) నిర్మించిన ఈ చిత్రం మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ : ‘‘మా సినిమాలో 12 లిప్ లాక్స్ ఉన్నాయి. కథ డిమాండ్ చేయడంతోనే బోల్డ్‌గా తీశాం. అలా తీస్తేనే ప్రేక్షకులకు చేరువయ్యే సినిమా ఇది’’ అని చెప్పారు.

‘‘స్కూల్ స్టేజ్ నుంచి టీనేజ్ వరకు ఓ యువకుడు పలువురు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. అతడు నిజాయితీగా ప్రేమిస్తాడు కానీ అమ్మాయిలు ఏం చేశారు అనేది ఆసక్తికరంగా చూపించాం.. మా హీరోకి బెస్ట్ లిప్ కిస్సర్ అవార్డ్ ఇవ్వొచ్చు. అంత అద్భుతంగా నటించాడు. స్టోరి, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ చక్కగా కుదిరాయి.. వందకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.  

See Also | అన్న ఆదుకుంటాడు-తమ్ముడు వాడుకుంటాడు : లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు