తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి.. కొడుకు పెళ్లిని లైవ్‌లో చూడనున్న నిర్మాత..

  • Published By: sekhar ,Published On : July 17, 2020 / 06:47 PM IST
తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి.. కొడుకు పెళ్లిని లైవ్‌లో చూడనున్న నిర్మాత..

మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్‌లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర, మతాంతర, కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు(జూలై 17) సాయంత్రం 8 గంటల 15 నిముషాలకు అమెరికాలోని సౌత్ కరోలినాలో జరగనుంది.

Vineeth, Caitlin

సూపర్ స్టార్ కృష్ణ- శ్రీమతి విజయనిర్మల కాంబినేషన్లో పి.సి. రెడ్డి దర్శత్వంలో ‘‘అన్నయ్య’’ అనే 500 ఏపిసోడ్స్ మెగా టీవీ సీరియల్‌తో పాటు టాలీవుడ్‌లో పలు తెలుగు చిత్రాలు నిర్మించి, వందలాది చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్ కమ్ ఫైనాన్సియర్ సోమా విజయ ప్రకాష్- సోమా జ్యోతి దంపతుల తనయుడు సోమా వినీత్ వివాహం అమెరికా వాస్తవ్యులు మిస్టర్& మిస్సెస్ అలన్ ఏ.రస్సెల్ కుమార్తె కైత్లిన్ తో ఈ రోజు జరగనుంది.

 

Vineeth, Caitlin వాస్తవానికి వీరి వివాహాన్ని గత మే 22న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు నిర్మాత సోమా విజయ ప్రకాష్. కానీ కరోనా అవరోధం కారణంగా అది సాధ్యపడకపోవటంతో ఈ రోజు కేవలం పది పన్నెండు మంది స్థానిక అతిథుల సమక్షంలో జరుగుతున్న వివాహాన్ని హైదరాబాద్ నుండి లైవ్‌లో చూస్తూ సరిపెట్టుకుంటున్నారు సోమా విజయ ప్రకాష్ దంపతులు. అయితే యూ‌ట్యూబ్ లైవ్ ద్వారా తమ కుమారుడి వివాహాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులు అందరూ చూడగలగడం ఆనందంగా ఉంది అంటున్నారు సోమా విజయ ప్రకాష్. కాగా కరోనా కష్టకాలంలో జరుగుతున్న ఈ ఖండాంతర ప్రేమ వివాహం పట్ల మీడియా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ లైవ్ టెలికాస్ట్‌కు సన్నాహాలు చేయటం విశేషం.

Vineeth, Caitlin