Sudhakar Reddy : టికెట్ రేట్లు పెంచకుండానే బాహుబలి కోట్లు కలెక్ట్ చేసింది.. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు?

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ''విక్రమ్‌ సినిమాకి మంచి ఫలితం వచ్చింది. ఇప్పటివరకు తెలుగులోనే 80 కోట్ల గ్రాస్‌ వచ్చింంది. వసూళ్లతో కమల్‌గారు, నేను, ఎగ్జిబిటర్లు అందరం.......................

Sudhakar Reddy : టికెట్ రేట్లు పెంచకుండానే బాహుబలి కోట్లు కలెక్ట్ చేసింది.. ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు?

Sudhakar Reddy

Sudhakar Reddy :  ఇటీవల కాలంలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. వాటికి కలెక్షన్స్ వచ్చాయి కదా అని మిగిలిన సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి కూడా టికెట్ రేట్లు పెంచడంతో మొదటికే మోసమొచ్చింది. జనాలు ఎవ్వరూ థియేటర్ కి కూడా రావడం లేదు. దీంతో టాలీవుడ్ నిర్మాతలు దిగి రాక తప్పలేదు. కొన్ని రోజుల క్రితం అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ లు స్వయంగా టికెట్ రేట్లు పెంచి తప్పు చేశామని, రాబోయే సినిమాలకు టికెట్ రేట్లు పెంచమని తెలిపారు.

ఇక తాజాగా వారం రోజుల క్రితం కమల్ హాసన్ విక్రమ్ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో హీరో నితిన్ తండ్రి, శ్రేష్ఠ మూవీస్ అధినేత, నిర్మాత సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా భారీగా సక్సెస్ అయి మంచి లాభాలు రావడంతో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల విషయం కూడా మాట్లాడారు.

సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ”విక్రమ్‌ సినిమాకి మంచి ఫలితం వచ్చింది. ఇప్పటివరకు తెలుగులోనే 80 కోట్ల గ్రాస్‌ వచ్చింంది. వసూళ్లతో కమల్‌గారు, నేను, ఎగ్జిబిటర్లు అందరం హ్యాపీగా ఉన్నాం. నేను ‘విక్రమ్‌’ ప్రివ్యూ చూడలేదు. లోకేశ్‌పై నమ్మకంతో, కమల్‌గారు, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్, సూర్య ఉన్నారని సినిమా తీసుకున్నాం. ‘విక్రమ్‌’ సినిమా ట్రైలర్‌ చూసి మా అబ్బాయి కూడా సినిమాని తీసుకోమన్నాడు”

Pranitha : పండంటి పాపకి జన్మనిచ్చిన హీరోయిన్ ప్రణీత..

”సినిమా అనేది ఓటీటీలో చూస్తే అంత ఎఫెక్ట్‌ ఉండదు. థియేటర్‌ అనుభవం వేరు. పెద్ద సినిమాలు రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని రూల్‌ పెట్టుకుంటే పరిశ్రమకు కూడా మంచిది. టికెట్‌ ధరలు పెంచడం అర్థం లేనిది. ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. 200 నుండి 350 పెట్టుకోమన్నారు. కానీ 350 పెట్టకూడదు. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము ఈ సినిమాకి మల్టీఫ్లెక్స్ లో 200 మాత్రమే పెట్టాం. కలెక్షన్స్ బాగానే వచ్చాయి. గతంలో టికెట్‌ ధరలు పెంచకముందే ‘బాహుబలి 2’ నైజాంలో 55 కోట్లు వసూలు చేసింది. మరి ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారో అర్థం కావడం లేదు. పెరిగిన టికెట్ ధరల వల్ల రిపీట్‌ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్‌కి రావడంలేదు. దీంతో నష్టం తప్ప లాభం ఎవ్వరికి లేదు. చెన్నైలో టికెట్‌ ధరలు మనకంటే తక్కువగానే ఉన్నాయి’’ అని తెలిపారు.