Suresh Babu : ‘మా’ ఎన్నికలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు..

ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ‘మా’ ఎలక్షన్స్‌పై టెన్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు..

Suresh Babu : ‘మా’ ఎన్నికలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు..

Suresh Babu

Suresh Babu: ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారుతున్నాయి. ప్రెసిడెంట్ రేసులో వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, మంచు ఫ్యామిలీ నుంచి హీరో విష్ణు, ‘మా’ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్, హేమ బరిలో దిగనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికలపై తమ అభిప్రాయాలను బాహాటంగా వెల్లడించారు. ఇక రీసెంట్‌‌గా ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు ‘మా’ ఎలక్షన్స్‌పై టెన్ టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యాలు చేశారు.

Vijayashanthi : ‘మా’ ఎన్నికలపై విజయ శాంతి స్పందన..

ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్నవి ఎప్పుడైనా జరగొచ్చు. ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ లాంటిది. అందరూ కూర్చొని ‘మా’ లో ఇష్యూస్‌పై చర్చించుకోవాలి. మన ఇంటి సమస్యని మన ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. ‘మా’ పై వివాదాలు కావాలని చేస్తున్నారో లేక అవే పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు.

ఈ పాండమిక్ వల్ల థియేటర్స్‌కి ఇబ్బందులు చాలా ఉన్నాయి.. థియేటర్స్ ఓపెన్ అవ్వాలి అంటే గవర్నమెంట్‌లు సహకరించాలి. రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్ల ఓనర్లకు కొన్ని లాభదాయక సలహాలు ఇస్తే వారికి రిలీఫ్‌గా ఉంటుంది. టాలెంట్‌ను డిస్‌ప్లే చెయ్యడానికి ఓటీటీ అనేది మంచి ప్లాట్‌ఫామ్. సినిమాలు థియేటర్స్‌కి వెళ్తాయా? లేక ఓటీటీకి వెళ్తాయా అనేది నిర్మాతను బట్టి ఉంటుంది. కరోనా వల్ల ఏర్పడిన లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగే థియేటర్స్ ఓనర్స్ కూడా కష్టాలు పడుతున్నారు. నా సినిమాల నిర్మాణంలో నాకు పార్టనర్స్ ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళను కలుపుకుపోవాలి. కరోనా వల్ల ఓటీటీకి ఆదరణ పెరిగింది’’.. అన్నారు.

Prakash Raj : పదవుల కోసం కాదు.. పనులు చేయడానికే..

‘మా’ ఎన్నికలు, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, థియేటర్ల ఓనర్ల సమస్యల వంటి పలు అంశాల గురించి సురేష్ బాబు 10 టీవీతో మాట్లాడారు. విక్టరీ వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మించిన ‘నారప్ప’ సినిమా ఈనెల 20న ఓటీటీలో విడుదల కానుంది.