బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం : తమ్మారెడ్డి భరద్వాజ

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 09:38 AM IST
బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం : తమ్మారెడ్డి భరద్వాజ

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేటట్టు కనిపించడం లేదు. నిన్న బాలకృష్ణకు నాగబాబు ఘాటుగా సమాధానం చెప్పడం..ఇవాళ చిరంజీవి ఇంట్లో కొంతమంది సినీ పెద్దలు సమావేశం కావడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో జరిగిన సమావేశానికి తమ్మారెడ్డి భరద్వాజ్, ఎన్ శంర్, సి.కళ్యాణ్, బెనర్జీ హాజరయ్యారు. 

సినీ ప్రముఖల భేటీకి తనను కూడా పిలవ లేదని తమ్మారెడ్డి తెలిపారు. పలానా వాళ్లను పిలవాలని లేదని..తనను కూడా పిలవలేదని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అంటే తానేమీ బాలకృష్ణ కంటే పెద్దవాన్ని అని చెప్పడం కాదన్నారు. బాలకృష్ణ అవసరమైనప్పుడు ఆయన్ను పిలుస్తారని చెప్పారు. షూటింగ్స్ ఓపెనింగ్ చేసుకోవడానికి రన్నింగ్ ప్రొడ్యూసర్స్ సమావేశం అయ్యారే కానీ వేరే విధంగా కాదని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ, నాగబాబు వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. 

చిరంజీవి ఇంట్లో సీసీసీ రివ్యూ మీటింగ్ జరిగిందని నిర్మాత సి.కళ్యాణ్ చెప్పారు. బాలకృష్ణను పిలవకపోవడం ఏమి లేదని ప్రొడ్యూసర్స్ లీడ్ తీసుకుని మీటింగ్స్ జరిగాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్.. చిరంజీవి, నాగార్జునలు లీడ్ తీసుకొమని చెప్పడం ద్వారా అలా జరిగాయన్నారు. 

బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ చానెల్ సాక్షిగా మండిపడ్డారు. మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవడం తప్పో ఒప్పో తనకు తెలియదని…అందుకు నిర్వహకులను అడగాల్సిన బాధ్యత బాలకృష్ణకు ఉందన్నారు. అయితే భూములు పంచుకుంటున్నారా అన్న వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.

నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఇండస్ట్రీతోపాటు బాలకృష్ణ..తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అవమానించారని మండిపడ్డారు. అందుకే బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీకి టీఆర్ఎస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినీ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్న వారినే సమావేశానికి పిలిచామని ఇది దర్శకులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన అంశం అన్నారు. అందుకే వారితో మాట్లాడానని స్పష్టం చేశారు. అందరినీ పిలిచి సమావేశం పెట్టాలని ఎవరైనా అంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ సమావేశానికి కూడా వచ్చి మాట్లాడతానని చెప్పారు. 
 

Read: సెగలు రేపుతున్న రకుల్ .. మరీ ఇంత బోల్డ్‌గా..