Cinema : సినిమాలకి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ విధానం అమలు చేయాలి

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత, ట్యాక్స్ లు హాట్ టాపిక్ గా వినపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ రోజూ వార్తల్లో....

Cinema : సినిమాలకి దేశ వ్యాప్తంగా ఒకే ట్యాక్స్ విధానం అమలు చేయాలి

Rajendar

Cinema :    గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత, ట్యాక్స్ లు హాట్ టాపిక్ గా వినపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ రోజూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తమిళనాడులో కూడా సినీ పరిశ్రమ నుంచి మరో డిమాండ్ వచ్చింది. తమిళనాడు సినీ నిర్మాతల మండలి ప్రధాన సలహాదారుడు టి.రాజేందర్‌ దేశవ్యాప్తంగా సినిమాలకు ఒకే టాక్స్‌ విధానం అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

RGV : కరోనాని, వాళ్ళని భరించాల్సిందే : ఆర్జీవీ

అంతే కాక సినిమాలకు వీపీఎఫ్‌ (వర్చువల్‌ ప్రిట్‌ ఫీ) తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు సినీ నిర్మాతల మండలి తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వీపీఎఫ్‌ టాక్స్‌ తగ్గించాలని గత రెండేళ్లుగా కోరుతున్నామని, అయితే ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజేందర్. తాము థియేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, వీపీఎఫ్‌ టాక్స్‌ అనేది క్యూబ్‌ సంస్థలకు, థియేటర్ల యాజమాన్యానికి సంబంధించిన విషయం. ఇందులో నిర్మాతలకు సంబంధం లేదు, అలాంటిది నిర్మాతల్ని టాక్స్‌ చెల్లించమనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. అదేవిధంగా ఎల్‌బీటీ (లోకల్‌ బాడీ టాక్స్‌)ని కూడా ప్రభుత్వం రద్దు చేయాలని, దేశ వ్యాప్తంగా సినిమాలకి ఒకే ట్యాక్స్ విధానం ఉండాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.