The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ నిషేధించాలి అనే వారిపై.. ఫైర్ అయిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు మెంబర్స్..

ఈ సినిమాపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు ఈ సినిమాను తమ రాష్ట్రాల్లో నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అయితే సినిమాను నిషేధించడంతో పాటు మమతా బెనర్జీ సినిమాపై పలు వ్యాఖ్యలు చేయడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు మెంబర్స్ ఫైర్ అయ్యారు.

The Kerala Story : ‘ది కేరళ స్టోరీ’ నిషేధించాలి అనే వారిపై.. ఫైర్ అయిన ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు మెంబర్స్..

Producers Guild of India and CBFC Members fires in who oppose The kerala Story Movie

The Kerala Story :  కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో, రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాము అని చెప్తూ తీసిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). ఈ సినిమా టీజర్ రిలీజ్ నుంచి కూడా సినిమాపై పలు విమర్శలు వస్తూనే ఉన్నాయి. అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించగా సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించారు.

ది కేరళ స్టోరీ సినిమా మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు. కానీ కొన్ని థియేటర్స్ విమర్శలకు, వివాదాలకు భయపడి షోలని క్యాన్సిల్ చేయగా, కొంతమంది ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకోవాలని చూసినా చిత్రయూనిట్ హైకోర్టు వరకు కూడా వెళ్లి సినిమా ఆపకుండా కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం కర్ణాటక ఎలక్షన్స్ ప్రచారంలో ది కేరళ స్టోరీ సినిమాని సమర్థిస్తూ మాట్లాడారు. ఇక ఈ సినిమా మౌత్ టాక్ తో మంచి విజయం సాధించడంతో ఇప్పటికే సినిమా రిలీజయిన అయిదు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ఈ సినిమాపై పలువురు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ ప్రభుత్వాలు ఈ సినిమాను తమ రాష్ట్రాల్లో నిషేధించాయి. మరికొన్ని రాష్ట్రాలేమో ది కేరళ స్టోరీ సినిమాకు ట్యాక్స్ ఫ్రీ ఇచ్చాయి. అయితే సినిమాను నిషేధించడంతో పాటు మమతా బెనర్జీ సినిమాపై పలు వ్యాఖ్యలు చేయడంతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా, సెన్సార్ బోర్డు మెంబర్స్ ఫైర్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అఫ్ ఇండియా అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ .. ఒక సినిమాని రిలీజ్ చేయాలా వద్దా అనేది చెప్పాల్సింది ఫిలిం సెన్సార్ బోర్డు. వాళ్ళు ఒకసారి క్లియరెన్స్ ఇచ్చాక సినిమాని అడ్డుకోకూడదు. ప్రజలు కావాలంటే ఆ సినిమాని చూసి హిట్ చేస్తారు, వద్దు అనుకుంటే చూడకుండా ఫ్లాప్ చేస్తారు. ఒక సినిమాను నిషేధించే హక్కు CBFC కి తప్ప ఇంకెవరికి లేదు. ఇటీవల ఇలా కొన్ని సినిమాలని నిషేదిస్తాం అంటూ వస్తున్న వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, దానిపై చర్యలు తీసుకోవాలి అని అధికారికంగా తెలిపారు.

The Kerala Story Movie : ది కేరళ స్టోరీ మూవీపై ఉత్తరప్రదేశ్ కీలక నిర్ణయం

అలాగే సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్స్ లో ఒకరు మీడియాతో ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించడంపై మాట్లాడుతూ.. మీరు ప్రేక్షకుల ప్రజాస్వామ్య హక్కును తొలగిస్తున్నారు. ఒక సినిమా భవిష్యత్తుని నేను, మీరు, నిర్మాత కాదు నిర్ణయించేది. ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఇలాంటి సినిమాలు ఉంటాయి. మేము దానికి తగ్గ సర్టిఫికెట్ ఇస్తాము. ఏమైనా కట్స్ ఉంటే మేము చెప్తాము. ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కు ఇంకా ఉంది. దానికి భంగం కలిగితే దేవుడే రక్షించాలి అని అన్నారు. ఇలా ది కేరళ స్టోరీ సినిమాకు ప్రేక్షకులతో పాటు, పలువురు మద్దతు తెలుపుతున్నారు.