Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!

టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇలా సడెన్‌గా సినిమా కార్మికులు సమ్మెకు దిగడంతో....

Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!

Producers Meeting In Telugu Film Chamber

Film Chamber: టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఇలా సడెన్‌గా సినిమా కార్మికులు సమ్మెకు దిగడంతో బడా సినిమాలు మొదలుకొని, చిన్న సినిమాల షూటింగ్‌లు వరకు అన్నింటినీ నిలిపేస్తున్నట్లుగా సినీ కార్మికులు తెలిపారు. అయితే సినీ కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది.

ఈ సందర్భంగా కార్మికులు ఉన్నపలంగా సమ్మె చేయడం ఏమాత్రం మంచిది కాదని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ అన్నారు. సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. కేవలం ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి ఒక లేఖ వచ్చిందని.. అంతకంటే ముందే వేతనాలపై ఫిల్మ్ ఛాంబర్ ఆలోచిస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా తప్పు. ఏది ఏమైనా షూటింగ్‌లు ఆపేదే లేదని.. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్‌కు హాజరుకావాలని.. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తామని ఆయన అన్నారు.

ఫిలిం ఫెడరేషన్‌కు 5 షరతులు విధిస్తున్నాం. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. అందరం కలిసి షూటింగ్‌లు జరుపుకుందాం. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడరు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే మేమే షూటింగ్ లు ఆపేస్తామని ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ అన్నారు.