Bollywood Stars: ప్రొడక్షన్ దగ్గర నుంచి ఐపీఎల్ వరకు.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!
ఒకప్పటిలా ఒక్క బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చెయ్యడానికి ఇష్టపడడం లేదు స్టార్లు. ఒక ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసుకొని సింపుల్ గా సినిమా, వెబ్ సిరీస్‌లలోనే పెట్టుబడులు పెట్టాలని..

Bollywood Stars: ఒకప్పటిలా ఒక్క బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చెయ్యడానికి ఇష్టపడడం లేదు స్టార్లు. ఒక ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేసుకొని సింపుల్ గా సినిమా, వెబ్ సిరీస్‌లలోనే పెట్టుబడులు పెట్టాలని అనుకోవట్లేదు. డిఫరెంట్ కేటగిరీల్లో డిఫరెంట్ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఈ జనరేషన్. స్పెషల్లీ బాలీవుడ్ స్టార్లైతే స్టార్టప్స్ దగ్గరనుంచి ఐపిఎల్ వరకూ ప్రతి దాన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!
ఇన్వెస్ట్ మెంట్స్ చెయ్యడంలో బాలీవుడ్ తర్వాతే ఎవరైనా. బాలీవుడ్ స్టార్లు.. ఒక్కచోట కాకుండా రకరకాలుగా తమ సంపాదనని ఇన్వెస్ట్ చేస్తారు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్.. సినిమాలు, యాడ్స్ తో పాటు, రకరకాల బ్రాండింగ్ ప్రమోషన్లతో కోట్లకు కోట్లు సంపాదిస్తారు. ఆ డబ్బునంతా రెడ్ చిల్లీస్ ప్రొడక్షన్ కంపెనీ తోపాటు ఐపిఎల్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ఓటీటీ స్టార్ట్ చేసి స్మార్ట్ ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు.
Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!
స్టార్ హీరో బాలీవుడ్ హల్క్ హృతిక్ రోషన్ ఫిట్ నెస్ స్టార్టప్‌లపై ఇంట్రస్ట్ తో కల్ట్ ఫిట్ ఫిట్ నెస్ చెయిన్ స్టార్ట్ చేశారు. వీటితో పాటు ప్రొడక్షన్ హౌజ్ లో కూడా తన ఎర్నింగ్స్ పెడుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ఎంత సంపాదిస్తారో.. అంతకుమించి చారిటీ కూడా చేస్తారు. సల్మాన్ ఖాన్‌కు మూవీ ప్రొడక్షన్ తో పాటు ‘బీయింగ్ హ్యుమన్’ బ్రాండ్ లో ఇన్వెస్ట్ మెంట్ తో పాటు సొంత బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెష్ కంపెనీ లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు.
Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!
మరో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ కూడా తన సినిమాల ద్వారా, యాడ్స్ ద్వారా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బుని ఒక్క ప్రొడక్షన్ కంపెనీలోనే కాకుండా.. ఆన్‌లైన్ ఫర్నీచర్ రెంటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు యాక్సెసరీస్‌కు చెందిన స్టార్టప్ తో పాటు హెల్త్, ఫిటెనెస్ స్టార్టప్.. ఒక పేమెంట్ గేట్‌వే సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు అమీర్ ఖాన్.