PS-2 Movie: ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకున్న పొన్నియిన్ సెల్వన్-2
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు.

PS-2 Movie Locks Trailer Release Date
PS-2 Movie: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాను పీరియాడిక్ మూవీగా మణిరత్నం తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. భాషతో సంబంధం లేకుండా PS-1 మూవీకి అదిరిపోయే రెస్పాన్స్‌ను అందించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా PS-2 కూడా ఉంటుందని గతంలోనే వెల్లడించింది చిత్ర యూనిట్.
దీంతో ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పొన్నియిన్ సెల్వన్-2 మూవీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
Ponniyin Selvan II : PS-2 రిలీజ్ డేట్లో మార్పు లేదు.. కన్ఫార్మ్ చేసిన నిర్మాతలు..
ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విక్రమ్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి PS-2 ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Fire in their eyes. Love in their hearts. Blood on their swords. The Cholas will be back to fight for the throne! #PS2TrailerFromMarch29#PS2 #ManiRatnam @arrahman @madrastalkies_ @Tipsofficial @tipsmusicsouth @IMAX @primevideoIN @chiyaan #AishwaryaRaiBachchan#PonniyinSelvan2 pic.twitter.com/iShNmBObDg
— Lyca Productions (@LycaProductions) March 24, 2023