వెన్నులో వణుకుపుట్టించే ‘సైకో’ టీజర్

ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘సైకో’ టీజర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 26, 2019 / 05:21 AM IST
వెన్నులో వణుకుపుట్టించే ‘సైకో’ టీజర్

ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘సైకో’ టీజర్ విడుదల..

ప్రేక్షకులను ఉత్కంఠకు, థ్రిల్‌కు గురిచేసే థ్రిల్లర్ సినిమాలకెప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పుడు అదే కోవలో కోలీవుడ్‌లో ‘సైకో’ అనే సినిమా తెరకెక్కుతుంది. ఉదయనిధి స్టాలిన్, అదితి రావు హైదరీ, నిత్యా మీనన్ మెయిన్ లీడ్స్.. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై.. ‘ముగమూడి’ (మాస్క్), ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్) సినిమాలతో ఆకట్టుకున్న మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైకో’ టీజర్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు.

సైకలాజికల్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా టీజర్ క్షణం క్షణం ఉత్కంఠత కలిగించేలా, భయం కలిగిస్తూ.. ఆసక్తికరంగా ఉంది.. దారుణంగా జరుగుతున్న వరుస హత్యలు, పోలీసుల విచారణ.. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు?.. వంటి హింట్స్‌తో టీజర్ కట్ చేశారు.

Read Also : కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ : ఫస్ట్ లుక్

మ్యాస్ట్రో ఇళయరాజా ఆర్ఆర్ టీజర్‌లో హైలెట్ అయింది. విజువల్స్ బాగున్నాయి. సింగంపులి, రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ‘సైకో’ విడుదల కానుంది. మ్యూజిక్ : ఇళయరాజా, సినిమాటోగ్రఫీ : తన్వీర్ మీర్, ఎడిటింగ్ : ఎ. అరుణ్ కుమార్.