ఆదుకున్న అక్షయ్ : అమర జవాన్లకు రూ. 5 కోట్లు విరాళం

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచి తమ వంతు సాయం అందిస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : February 18, 2019 / 09:15 AM IST
ఆదుకున్న అక్షయ్ : అమర జవాన్లకు రూ. 5 కోట్లు విరాళం

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచి తమ వంతు సాయం అందిస్తున్నారు.

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచి తమ వంతు సాయం అందిస్తున్నారు. అంతేకాదు.. జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలంటూ బాలీవుడ్ నటులంతా సోషల్ మీడియా వేదికగా తమ అభినులందరిని కోరుతున్నారు. జమ్ముకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. జవాన్లపై దాడి ఘటనను దేశంలోని ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించారు. బాలీవుడ్ సినీనటులు కూడా ఉగ్రదాడిని తీవ్రంగా వ్యతిరేకించారు. అమరులైన భారత జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. 
 

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా జవాన్ల కుటుంబాలకు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ కే వీర్ అనే వెబ్ సైట్ ద్వారా జవాన్ల కుటుంబాలకు 51ఏళ్ల అక్షయ్.. తన వంతు ఆర్థిక సాయాన్ని అందించాడు. తన ట్విట్టర్ అకౌంట్లో తనను ఫాలో అవుతున్న 30 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్లను సైతం తమకు తోచినంత సాయం చేయాల్సిందిగా కోరాడు. ‘‘పుల్వామా ఉగ్రదాడి ఎప్పటికి మరువలేం. ఉగ్రదాడి ఘటనతో అందరి రక్తం ఆగ్రహాంతో మరిగిపోతోంది. స్పందించాల్సిన సమయం ఇది. అందరూ స్పందించండి. అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోండి. మీకు తోచినంత విరాళం ఇచ్చి అనాథలైన జవాన్ల కుటుంబాలను ఆదుకోండి.. భారత జవాన్లకు మనం ఇచ్చే ఘనమైన నివాళి ఇంతకంటే మరొకటి ఉండదు. ఆదుకోండి ప్లీజ్.. bharatkeveer.gov.in ఇదే అధికారిక వెబ్ సైట్. ఫేక్ యాప్స్, వెబ్ సైట్లు వలలో పడి మోస పోవద్దు’’ అని అక్షయ్ ట్వీట్ చేశాడు. 
 

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అమితాబ్ సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు. జవాన్ల  ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయించుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య 49కి చేరింది. నేను 50 మంది వరకు రూ.2.5 కోట్లు విరాళంగా ఇస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. మ్యూజిషయన్ బాద్ షా CRPF వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫండ్ కింద రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు.

Read Also : Pulwama effect: పాక్ క్రికెట్ మ్యాచ్‌లు మేం ప్రసారం చేయం

Read Also : పుల్వామా ఉగ్రదాడి : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత