Puneeth Painting : పునీత్ హార్ట్ టచింగ్ పేయింటిగ్

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం షాక్ నుంచి ఆయన అభిమానులు ఇంకా బయటకు రాలేకపోతున్నారు.

Puneeth Painting : పునీత్ హార్ట్ టచింగ్ పేయింటిగ్

Puneeth Painting

Puneeth Painting : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ఇంకా కన్నడ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణం తర్వాత పునీత్ ని చూడటానికి కంఠీరవ స్టేడియంకి దాదాపు 5 లక్షలకు పైగా అభిమానులు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ ని ఖననం చేశారు. గత రెండు రోజులుగా పునీత్ కుటుంబ సభ్యులు వారి సాంప్రదాయ ప్రకారం సమాధి వద్ద పూజలు నిర్వహిస్తున్నారు.

చదవండి : Puneeth Rajkumar : కంఠీరవ స్టేడియంకు బారులు తీరిన అభిమానులు

బుధవారం నుంచి అభిమానులని అధికారికంగా పునీత్ సమాధి దర్శనానికి అనుమతిచ్చారు. దీంతో నిన్నటి నుంచి కంఠీరవ స్టూడియోలో హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూడటానికి పెద్దసంఖ్యలో అభిమానులు తరలి వస్తున్నారు. స్టూడియో బయట వరకు క్యూలైన్స్ ఏర్పాటు చేయడంతో క్యూ లైన్స్ అన్ని కిక్కిరిసిపోయాయి.

చదవండి : Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై అసభ్య‌క‌ర‌మైన పోస్ట్‌ చేసిన యువకుడు అరెస్ట్

ఇక ఇదిలా ఉంటే కరణ్ ఆచార్య అనే పెయింటర్ రూపొందించిన ఫొటో.. ఇపుడు కర్ణాటకలో వైరల్ అవుతోంది. స్వర్గం(వైకుంఠం)లో తండ్రి రాజ్ కుమార్‌కు వెనుక వైపు నుంచి వచ్చి.. ఆయన కళ్లను పునీత్ మూసినట్టుగా ఉన్న ఆ చిత్రం ఎంతోమందిని కంట తడి పెట్టిస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవికత ఉట్టిపడినట్లు ఉన్న ఈ చిత్రం మనుషుల మనసులను కదిలిస్తుంది.

Puneeth Rajkumar