Puneeth Rajkumar : గంధడ గుడి.. పునీత్ వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి టీజర్‌ రిలీజ్..

తాజాగా పునీత్ నటించిన వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి టీజర్‌ను నిన్న రిలీజ్ చేశారు. దీంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీకి 'గంధడ గుడి'......

Puneeth Rajkumar : గంధడ గుడి.. పునీత్ వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి టీజర్‌ రిలీజ్..

Gandhada Gudi

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్‌, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి నెల పైగా అవుతున్నా కన్నడ ప్రజలు ఇంకా ఆయనకు నివాళులు అర్పిస్తూ తలుచుకుంటున్నారు. పునీత్ అభిమానులు, కన్నడ ప్రజలు ఆయన చివరి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా పునీత్ నటించిన వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి టీజర్‌ను నిన్న రిలీజ్ చేశారు. దీంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్‌బాస్‌లో ర్యాంకుల పండగ.. లాస్ట్‌లో సిరి.. మరి ఫస్ట్..??

పునీత్‌ ప్రకృతి ప్రేమికుడు. అందుకే ఆయన ఈ డాక్యుమెంటరీని చేశారని మేకర్స్ తెలిపారు. కర్ణాటక అడవుల నేపథ్యంలో తీసిన ఈ డాక్యుమెంటరీలో సుందరమైన బీచ్‌లు, నదుల అందాలను, అడవులను కర్ణాటక ప్రకృతి అందాల్ని చూపించనున్నారు పునీత్. కర్నాటక అడవుల పరిరక్షణ కోసం వన్యప్రాణి చిత్ర నిర్మాత అమోఘవర్షతో పునీత్ జతకట్టారు. పునీత్ చేసిన ఈ డాక్యుమెంటరీ చాలా కాలంగా తీస్తున్నారు. ఈ డాక్యుమెంటరీకి ‘గంధడ గుడి’ అనే పేరు పెట్టారు. ‘గంధడ గుడి’ అంటే గంధపు చెక్కల గుడి అని అర్ధం. తన సొంత రాష్ట్రం కర్ణాటక గురించి, రాష్ట్రంలోని అందాల గురించి దేశం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ చేపట్టినట్టు సమాచారం.

Kattappa : కట్టప్ప ఇంట్లో విషాదం..

నిన్న పునీత్‌ తల్లి పార్వతమ్మ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా ఆయన ఎంతో ఇష్టంగా చేసిన ‘గంధడ గుడి’ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ ‘గంధడ గుడి’ వైల్డ్‌లైఫ్‌ డ్యాక్యుమెంటరి వచ్చే ఏడాది థియేటర్లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాత, పునీత్ స్నేహితుడు అమోఘ వర్ష… ”గంధడ గుడి డాక్యుమెంటరీ కర్ణాటకలోని అరణ్యాల పవిత్రతను, సంపదను రక్షించడం వంటి ప్రాముఖ్యతను వివరిస్తుంది. అప్పు కల ఒక అద్భుతమైన ప్రయాణం, మా భూమి విశిష్టత గురించి తెలియజేసే ఒక పురాణం.. గంధడ గుడి” అంటూ ట్వీట్ చేశారు.

Bigg Boss 5 : సన్నీ-సిరి మధ్య లవ్ ట్రాక్.. సీరియస్ అవుతున్న షణ్ను..

పునీత్ మరణించిన తర్వాత ఆయనకు సంబంధించిన మొదటి వీడియో కావడంతో ఈ టీజర్ వైరల్ అవుతుంది. ఈ టీజర్ ఆద్యంతం ప్రకృతి ప్రేమికులని అలరించేలా ఉంది. కన్నడ ప్రజలు, పునీత్ అభిమానులతో పాటు ప్రకృతి ప్రేమికులు ఈ డాక్యుమెంటరీ కోసం ఎదురు చూస్తున్నారు.