Puneeth Rajkumar : పునీత్ కి ఉన్న చిరకాల కోరిక తీరేలోపే మరణం..

మెహర్ రమేష్ మాట్లాడుతూ... పునీత్‌ త‌న చిర‌కాల క‌ల నెర‌వేర‌కుండానే కన్నుమూశారు. పునీత్ నాకు లైఫ్‌ ఇచ్చిన హీరో. ఆయ‌న హీరోగా న‌టించిన‌ 'వీర క‌న్న‌డిగ' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా

Puneeth Rajkumar : పునీత్ కి ఉన్న చిరకాల కోరిక తీరేలోపే మరణం..

Puneeth

Puneeth Rajkumar :  క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణం కర్ణాటకని మాత్రమే కాదు దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆయ‌న సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా లక్షల్లో ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చారు. ఇవాళ ఉదయం ఆయన అంతక్రియలకి చెందిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పునీత్ కి నివాళులు అర్పించడానికి తెలుగు హీరోలు, సినీ ప్రముఖులు కూడా తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ మీడియాతో వాళ్ళకి, పునీత్ కి ఉన్న అనుబంధం గురించి తెలిపారు. పునీత్ కి నివాళులు అర్పించిన డైరెక్టర్ మెహర్ రమేష్ పునీత్ చిరకాల కోరిక గురించి తెలిపారు.

Puneeth Rajkumar : ఉదయం 4.30 గంటలకే ప్రారంభమైన పునీత్ అంతిమ యాత్ర

పునీత్ కి నివాళులు అర్పించిన తర్వాత డైరెక్టర్ మెహర్ రమేష్ మీడియాతో మాట్లాడారు. మెహర్ రమేష్ మొదటి సినిమా హీరో పునీత్. కన్నడలో ‘వీర కన్నడిగ’ అనే సినిమాని తీశారు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో పునీత్ కి మెహర్ రమేష్ కి మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ‘అజయ్’ అని ఇంకో సినిమా కూడా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

Puneeth Rajkumar : కొడుకులు లేకపోవడంతో.. పునీత్ రాజ్ కుమార్ కి తలకొరివి పెట్టేది ఇతనే..

మెహర్ రమేష్ మాట్లాడుతూ… పునీత్‌ త‌న చిర‌కాల క‌ల నెర‌వేర‌కుండానే కన్నుమూశారు. పునీత్ నాకు లైఫ్‌ ఇచ్చిన హీరో. ఆయ‌న హీరోగా న‌టించిన‌ ‘వీర క‌న్న‌డిగ’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాను. త‌ర్వాత ఆయ‌న‌తో మ‌రో సినిమా కూడా చేశాను. న‌న్ను ఇంటిస‌భ్యుడిలా చూసుకునేవాడు. నేను చిరంజీవితో ‘భోళా శంక‌ర్’ సినిమా ప్ర‌క‌టించిన‌ప్పుడు పునీత్ నాకు ఫోన్ చేసి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. చిరంజీవితో స్క్రీన్ పంచుకోవాల‌న్న‌ది త‌న కోరిక అని, ఈ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వ‌మ‌ని కోరారు. అది కుద‌ర‌క‌పోతే క‌నీసం ఏదైనా ఒక‌ పాట‌లో మెగాస్టార్‌తో క‌లిసి చిన్న స్టెప్పు వేస్తాన‌ని అడిగారు. నేను కూడా దానికి ఓకే చెప్పాను. కానీ ఇంత‌లోనే ఈ ఘోరం జరిగిపోయింది. పునీత్ కి చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే కోరిక నెరవేరలేదు అని చెప్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు.