Puri – Charmy: ‘లైగర్’ కోసం పూరి – ఛార్మీ..

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ తాజా షెడ్యూల్ కోసం పూరి - ఛార్మీ బాంబే బయలుదేరారు..

Puri – Charmy: ‘లైగర్’ కోసం పూరి – ఛార్మీ..

Puri Charmy

Puri – Charmy: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటి ఛార్మీ కౌర్ ముంబై పయనమయ్యారు. వీరిద్దరు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి – ఛార్మీ.. పాన్ ఇండియా స్థాయిలో ‘లైగర్’ సినిమా చేస్తున్నారు.

Bandla Ganesh : ‘‘రామాయణం.. మహాభారతం.. ‘గబ్బర్ సింగ్’.. ఏమైనా పోల్చాడా..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాండమిక్ వల్ల షూటింగ్ వాయిదా పడింది. రీసెంట్‌గా షూటింగ్ పున: ప్రారంభమైంది. తాజా షెడ్యూల్ కోసం పూరి – ఛార్మీ బాంబే బయలుదేరారు.

ప్రత్యర్థికి పంచ్ విసురుతున్న ‘లైగర్’..

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఛార్మీ, దర్శకుడు పూరితో పార్టనర్‌గా పూరి కనెక్ట్స్ (PC) బ్యానర్ మీద సినిమాలు నిర్మిస్తున్నారు. నటిగా కంటే నిర్మాతగానే హ్యాపీగా ఉన్నానని, ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని.. ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతానని ఇటీవల ఓ ఇంటర్వూలో వెల్లడించింది ఛార్మీ కౌర్.

Bangarraju : ‘బంగార్రాజు’ స్టార్ట్ అయ్యాడు.. ఆనందంలో అక్కినేని అభిమానులు..