Puri Jagannadh : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేదా పైసా వసూల్ సీక్వెల్.. పూరి నెక్స్ట్ ఏంటి??

పూరీ జగన్నాద్ లైగర్ ఫ్లాప్ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సినిమా అనౌన్స్ చెయ్యకపోయినా స్టోరీ సిట్టింగ్స్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పూరీ.

Puri Jagannadh : ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లేదా పైసా వసూల్ సీక్వెల్.. పూరి నెక్స్ట్ ఏంటి??

Puri Jagannadh Next Movie Update

Puri Jagannadh :  పూరీ జగన్నాధ్ కెరీర్ లోనే పెద్ద సినిమా.. రెండేళ్ల పాటు టైమ్ తీసుకుని భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా, ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సినిమా లైగర్(Liger) డిజాస్టర్ అయ్యి పూరీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. లైగర్ రిలీజ్ అయ్యి 8 నెలలు దాటిపోయినా ఇంకా పూరీ తన నెక్ట్స్ సినిమా మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. అయితే ఈ గ్యాప్ కి బ్రేక్ ఇస్తూ త్వరలోనే పూరీ సినిమా స్టార్ట్ చెయ్యబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

పూరీ జగన్నాద్ లైగర్ ఫ్లాప్ తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఇప్పటి వరకూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు. సినిమా అనౌన్స్ చెయ్యకపోయినా స్టోరీ సిట్టింగ్స్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు పూరీ. గతంలో కూడా పూరి అనేక సార్లు ఇలాంటి ఫ్లాప్స్ చూసినా మళ్ళీ గ్రాండ్ కంబ్యాక్ ఇస్తూనే వచ్చారు. దీంతో ఈ సారి కూడా పూరి జగన్నాధ్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూరి తన నెక్స్ట్ సినిమా కథల మీద వర్క్ చేస్తున్నాడు. దీంట్లో భాగంగానే అటు సీనియర్ హీరో బాలయ్యకి, ఇటు యంగ్ హీరో రామ్ కి కథలు వినిపించారట.

బాలయ్య ఆల్రెడీ పూరీతో పైసా వసూల్ లాంటి క్రేజీ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా బాలయ్యని సరికొత్త పాత్రలో చూపించారని అభిమానులు పూరికి థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర మాత్రం బాగా క్లిక్ అయింది. అలాగే బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి పూరీ ఇస్మార్ట్ శంకర్ ఇచ్చి రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఇద్దరికీ మళ్ళీ కథలు చెప్పడంతో ఈ ఇద్దరిలోనే పూరి నెక్స్ట్ సినిమా ఉండబోతుందని సమాచారం. రామ్ కి అయితే ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కథే చెప్పినట్టు తెలుస్తుంది. డబల్ ఇస్మార్ట్ అనే పేరుతో దానికి సీక్వెల్ తీయాలని పూరి భావిస్తున్నాడట.

Jagapathi Babu : పుష్ప 2లో జగపతిబాబు.. అదిరిపోయే అప్డేట్.. ఇంకో విలన్ గానా?

అయితే బాలయ్యకు ఏ కథ చెప్పాడో తెలీదు కానీ, అభిమానులు మాత్రం పైసా వసూల్ క్యారెక్టర్ తో హిట్ సినిమా ఇవ్వమని పూరీని అడుగుతున్నారు. మరి రామ్, బాలయ్యలో పూరికి ఎవరు ఓకే చెప్తారో, పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.