Puri jagannadh : చాన్నాళ్లకు భార్యతో కనిపించిన పూరీ జగన్నాధ్.. రూమర్స్ కి చెక్ పెట్టేసినట్టేనా?

ఇటీవల పూరి జగన్నాధ్ తన భార్య, ఫ్యామిలీతో కలిసి తన సొంతూరికి వెళ్లి అక్కడ తమ కుటుంబం, బంధువులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. పూరి తన భార్యతో కలిసి హోమాలు నిర్వహిస్తున్నట్టు, పూజల్లో పాల్గొంటున్నట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Puri jagannadh : చాన్నాళ్లకు భార్యతో కనిపించిన పూరీ జగన్నాధ్.. రూమర్స్ కి చెక్ పెట్టేసినట్టేనా?

Puri jagannadh photos after a long time with Wife goes viral

Puri jagannadh :  ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాధ్. కొడితే దిమ్మ తిరుగుద్ది అన్నట్టు కొడితే ఒకేసారి పెద్ద హిట్ కొడతాడు, లేకపోతే వరుస ఫ్లాప్స్ లో ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అదే ఫామ్ లో విజయ్ దేవరకొండతో(Vijay Deverakonda) లైగర్(Liger) అంటూ వచ్చి చతికిల పడ్డాడు. పాన్ ఇండియా రేంజ్ అంటూ తీసిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక గత కొన్ని రోజులుగా పూరీ గురించి రూమర్స్ వస్తున్నాయి. పూరీ ఫ్యామిలీతో ఉండట్లేదని, భార్యని పట్టించుకోవట్లేదని, ప్రేమించి పెళ్లాడిన భార్యతో విభేదాలు వచ్చాయని, ఛార్మితో రిలేషన్ లో ఉన్నాడని పలు గాసిప్స్ వచ్చాయి. చోర్ బజార్ సినిమా ఈవెంట్ లో పూరి తనయుడు ఆకాష్ మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ తో, బండ్ల గణేష్ స్పీచ్ తో పూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని అందరూ నిర్దారణకు వచ్చేశారు. ఫ్యామిలీని, భార్యని పట్టించుకోకుండా ఛార్మితో తిరుగుతున్నాడని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ పుకార్లకు చెక్ పెడుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల పూరి జగన్నాధ్ తన భార్య, ఫ్యామిలీతో కలిసి తన సొంతూరికి వెళ్లి అక్కడ తమ కుటుంబం, బంధువులతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు సమాచారం. పూరి తన భార్యతో కలిసి హోమాలు నిర్వహిస్తున్నట్టు, పూజల్లో పాల్గొంటున్నట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూరి తన భార్యని హత్తుకొని దిగిన ఫోటో మరింతగా వైరల్ అవుతుండటంతో ఇన్ని రోజులు వీరి మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లకు పూరి చెక్ పెట్టేశాడు అంటున్నారు.

Custody Movie : 20 రోజులు నీళ్ళల్లోనే షూట్.. కస్టడీ సినిమాలో అదే హైలెట్..

Puri jagannadh photos after a long time with Wife goes viral

ఇక గతంలో ఈ విషయంలో పూరీ గురించి ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసిన బండ్ల గణేష్ తాజా ఫోటోలను షేర్ చేస్తూ అన్నయ్య, వదినలను ఇలా చూడటం చాలా ఆనందంగా ఉంది అని ట్వీట్ చేశాడు. మొత్తానికి పూరీ ఫ్యామిలీకి దగ్గరగానే ఉన్నాడు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.