Puri Jagannadh : పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా…

'లైగర్' సినిమాని ప్రస్తుతం కరణ్ జోహార్ తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఆ తర్వాత 'జనగణమన' సినిమా కూడా ఛార్మితో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ..........

Puri Jagannadh :  పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా…

Puri

 

Puri Jagannadh :  డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం ‘లైగర్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోతారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల అవ్వనుంది. ఈ సినిమా తర్వాత విజయ్ తోనే తన డ్రీం ప్రాజెక్టు ‘జనగణమన’ సినిమాని తెరకెక్కించడానికి కూడా రెడీ అయ్యాడు పూరి.

‘లైగర్’ సినిమాని ప్రస్తుతం కరణ్ జోహార్ తో కలిసి తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు పూరి జగన్నాధ్. ఆ తర్వాత ‘జనగణమన’ సినిమా కూడా ఛార్మితో కలిసి తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించనున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత పూరి జగన్నాధ్ పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ వర్క్ కూడా పూర్తి అయిందని సమాచారం. హాలీవుడ్ రేంజ్ లో చాలా భాషల్లో ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు సమాచారం.

Radhika Sharath Kumar : అప్పటి రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి ఈ సినిమాతో

అయితే ‘లైగర్’ తర్వాత ‘జనగణమన’ కూడా విజయ్ తోనే తీయనున్నారు. మరి అంతర్జాతీయ ప్రాజెక్టు ఎవరితో తీస్తారనేది మాత్రం తెలీదు. ‘లైగర్’ సినిమాతోనే భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రాజెక్టు అంటే పూరి ఇంకే రేంజ్ లో ప్లాన్ చేస్తాడో చూడాలి మరి. మొత్తానికి తెలుగు సినిమా, తెలుగు సినీ వ్యక్తులు హద్దులు చెరిపేసి ప్రపంచం నలుమూలలకు వెళ్తున్నారు.