Balakrishna: బాలయ్య కోసం కథను రెడీ చేస్తోన్న పూరి.. ఈసారైనా..?

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని మలిచిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.

Balakrishna: బాలయ్య కోసం కథను రెడీ చేస్తోన్న పూరి.. ఈసారైనా..?

Puri Jagannadh Reading Script For Nandamuri Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని మలిచిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు.

Balakrishna: మైఖేల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్న వీరసింహారెడ్డి

ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. కాగా, ఈ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టి అదరహో అనిపించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఇప్పటకే తన నెక్ట్స్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే తన తరువాత చిత్రాన్ని టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట బాలయ్య.

Puri Jagannadh: మరోసారి ఆకాష్ కోసం కథ రెడీ చేసిన పూరి..?

గతంలో వీరిద్దరి కాంబనేషన్‌లో పైసా వసూల్ అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. అయితే ఇప్పుడు మరోసారి పూరీ బాలయ్యతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. లైగర్ ఎఫెక్ట్‌తో ఢీలా పడ్డ పూరీ, బాలయ్యతో సినిమా చేసి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడట. ఈ క్రమంలోనే పూరి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాను బాలయ్య ఓకే చేస్తాడా లేడా అనేది సస్పెన్‌గా మారింది.