Puri Jagannadh : అర్జున్ రెడ్డి సినిమా 45 నిముషాలు చూసి ఆపేశా.. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది.. మా ఆవిడ నన్ను తిట్టింది..

ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, నువ్వేమో ఇలా వెనకబడ్డావు. కాస్త వేరేవాళ్ళ సినిమాలు కూడా చూడు అని చెప్పింది. సరే అని ఏ సినిమా చూడాలని అడిగాను. సందీప్ వంగా అనే కొత్త కుర్రాడు.............

Puri Jagannadh : అర్జున్ రెడ్డి సినిమా 45 నిముషాలు చూసి ఆపేశా.. మైక్ టైసన్ ని పట్టుకోవడానికి ఏడాది పట్టింది.. మా ఆవిడ నన్ను తిట్టింది..

Puri Jagannadh :  విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ఇండియా అంతా పీక్స్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి వరంగల్ లో ఫ్యాన్ డం పేరుతో ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి లైగర్ చిత్ర యూనిట్ అందరూ విచ్చేశారు.

ఈ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ”వర్షం పడుతున్నా తడుచుకుంటూ వచ్చి నిలబడ్డ మీ అందరికీ లవ్యూ. లైగర్ ఆగస్ట్ 25న రిలీజ్ కాబోతోంది. కరణ్ జోహర్‌కు థ్యాంక్స్. కింగ్ ఆఫ్ బాలీవుడ్. రాజులా బతుకుతాడు. ఆయనే మాకు సపోర్ట్ చేశాడు. అపూర్వ మెహతా, ధర్మ టీం అందరికీ థ్యాంక్స్. ఒకరోజు మా ఆవిడ నన్ను తిట్టింది. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు, నువ్వేమో ఇలా వెనకబడ్డావు. కాస్త వేరేవాళ్ళ సినిమాలు కూడా చూడు అని చెప్పింది. సరే అని ఏ సినిమా చూడాలని అడిగాను. సందీప్ వంగా అనే కొత్త కుర్రాడు తీశాడు అర్జున్ రెడ్డి అని, నేను నా కూతురు ఆల్రెడీ మూడుసార్లు చూశామని చెప్పింది. వెంటనే నేను కూడా అర్జున్ రెడ్డి సినిమా చూశాను. ఓ 45 నిమిషాలు చూసి ఆపేశాను. డైరెక్షన్ బాగుంది, కానీ నేను మాత్రం విజయ్ గురించి ఆలోచిస్తుండిపోయా. ఇంత జెన్యూన్‌గా, నిజాయితీగా నటిస్తున్నాడేంటి అనుకున్నాను. అతనితో పని చేయాలని ఆరోజే డిసైడ్ అయ్యాను. తెరపై యాక్టింగ్‌లోనే కాదు బయట కూడా నిజాయితీగా ఉంటాడు విజయ్.”

”విజయ్ సినిమాల్లోనే హీరో కాదు బయట కూడా హీరోనే. కోటి రూపాయలు ఇస్తే సినిమాకు ఖర్చు పెట్టండి తరువాత తీసుకుంటాను అని అంటాడు. రెండు కోట్లు పంపిస్తే మీకు అప్పులు ఉన్నాయి కదా ఫస్ట్ అవి కట్టండి అని అంటాడు. ఇలాంటి హీరో ఎక్కడ ఉంటారయ్యా. విజయ్ ఫాదర్ నాకు ఫ్రెండ్. ఈ సినిమా ముందు విజయ్ ని నా కొడుకు అనుకుని మంచి సినిమా తీయమని అన్నాడు. కానీ విజయ్ నన్ను తండ్రిలా చూసుకున్నాడు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు.”

Vijay Devarakonda : నేనింకా చిన్న పిల్లాడ్ని.. సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది..

”సినిమాకి సంబంధించిన పనులన్నీ విజయ్, చార్మీలు ప్లాన్ చేస్తారు. అన్ని పనులు వాళ్లే చూసుకుంటారు. మైక్ టైసన్‌ను పట్టుకోవడానికి మాకు ఏడాది పట్టింది. దాని అంతటికి కారణం ఛార్మీనే. జూమ్ కాల్స్, లీగల్ పనులు, ఫుల్ స్క్రిప్ట్ అంతా పంపించమని అడిగాడు. చాలా స్ట్రగుల్స్ తర్వాత లాస్ ఏంజిల్‌కు వెళ్లాం. అక్కడి క్రూని మాట్లాడుకున్నాం. అక్కడి వాళ్లకు మైక్ టైసన్ వస్తాడని చెబితే ఎవ్వరూ నమ్మలేదు. మైక్ టైసన్ అసలు వస్తాడా? అని విజయ్ కూడా అలానే అడిగాడు. నాకు చాలా భయం వేసింది. టెన్షన్‌లో ఉంటే అలా కారులోంచి దిగి మైక్ టైసన్ నడుచుకుంటూ వచ్చాడు. హమ్మయ్య వచ్చాడని అనుకున్నాను. మైక్ టైసన్ గురించి ప్రపంచంలో ఏ మూల అడిగినా చెబుతారు. అలాంటి వారితో పని చేశానా, మైక్ టైసన్ పక్కన కూర్చున్నానా అని అనుకున్నాం. మేం చాలా లక్కీ.”

”ఇక అనన్య మా రాణి. అందగత్తే కాదు మంచి నటి, ఫైర్ బ్రాండ్. ఆడాళ్లు మగాళ్ల మీద అరుస్తూ చేస్తే నాకు ఇష్టం. ఇది లవ్ స్టోరీ. దాన్ని మీరు చూడాలి. రమ్యకృష్ణ గారు రెబల్ తల్లి. ఇలాంటి తల్లి ఉండాలని కోరుకుంటారు. నేను ఆవిడతో మొదటి సారి పని చేశాను. ఛార్మీ అయితే సినిమా కోసం మగాళ్ల కంటే కూడా ఎక్కువ కష్టపడుతుంటుంది. నా వరకు ఏదీ రానివ్వదు. అన్నీ తనే చూసుకుంటుంది. ఏదైనా కొంపలు మునిగేది అయితే తప్పా రానివ్వదు. ప్రొడక్షన్‌లోనే కూర్చుని ఏడుస్తుంటుంది. ఏడ్వడం కూడా నాకు చెప్పదు. ప్రొడ్యూసర్లకు అన్ని కష్టాలుంటాయ్. ఏ ప్రొడ్యూసర్ కూడా ఏడ్వకుండా సినిమాను తీయలేడు. ఏ కష్టం ఉన్నా నాకు చెప్పదు. విజయ్‌కి చెబుతుంది. వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సినిమాకు అన్నీ తానై ఇక్కడి వరకు తీసుకొచ్చింది. లవ్యూ ఛార్మీ. విలన్ గా నటించిన విషు మా బలం. ఆయన రియల్ ఫైటర్. లైగర్ టీం కోసం పని చేసిన అందరికీ థాంక్స్’’ అని ఎమోషనల్ గా మాట్లాడాడు.