God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరు ప్రస్తుతం ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ లో ఉండగా మరోవైపు ఆయన నటించే తదుపరి రెండు సినిమాలను కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇందులో ఒకటి భోళాశంకర్ కాగా..

God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?

God Father

Godfather: టాలీవుడ్ మెగాస్టార్ చిరు ప్రస్తుతం ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ లో ఉండగా మరోవైపు ఆయన నటించే తదుపరి రెండు సినిమాలను కూడా సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఇందులో ఒకటి భోళాశంకర్ కాగా.. మరొకటి మలయాళం లూసిఫర్ రీమేక్. మోహన రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ritu Varma: మనసు దోచే తెలుగు అందం రీతూ!

గాడ్ ఫాదర్ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్క్రిప్టులో సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకుడు. అయితే.. మొదటి నుండి ఈ రీమేక్ తెలుగీకరించడంలో మెగాస్టార్ సంతృప్తిగా లేరని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఒకదశలో దర్శకుడి మార్పు కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ, అదేమీ జరగలేదు. ఫైనల్ గా మోహన్ రాజానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే.. కొన్ని చోట్ల హీరో ఎలివేషన్స్ మీద ఇంకా ఏదో కావాలనుకున్న చిరు పూరితో మార్పులు చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Big Boss 5: ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?

ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్‌తో పాటు మరికొన్ని సన్నివేశాల్లో కూడా మాస్ ఎలివేషన్స్ కోసం పూరీ సాయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు మోహన్ రాజా కూడా పూరి జగన్నాథ్ తనదైన మార్పులకు అభ్యంతరం చెప్పలేదని.. అందుకే ఇది సాధ్యపడుతుందని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. పూరి ఎలిమెంట్స్ అంటే ఏ స్థాయిలో ఉంటాయో తెలుసు కనుకే మెగా అభిమానులు ఈ ప్రచారంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే మాత్రం మేకర్స్ నుండి ఏదోఒక ప్రకటన రావాల్సిందే.