Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం....

Pushpa2: పుష్ప-2 ముగింపు.. దానికి ఆరంభమా?
ad

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుండటంతో, పుష్ప2 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తోంది.

Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!

తాజాగా పుష్ప2 సినిమాలోని క్లైమాక్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా క్లైమాక్స్ కోసం సుకుమార్ ఓ అద్భుతమైన సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందంటే, పుష్స2 చిత్రం ముగింపు, మరో సీక్వెల్ పుష్ప3కు లీడ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప2 స్క్రిప్టుకు బన్నీ పలు మార్పులు చేయాల్సిందిగా కోరగా, సుకుమార్ కూడా అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?

ఇటీవల కేజీయఫ్ చాప్టర్-2లో కేజీయఫ్3కు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి లీడ్‌నే పుష్ప2 లోనూ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. అంటే.. పుష్పరాజ్ తన సత్తాను పుష్ప2తో మాత్రమే ఆపడని.. మున్ముందు పుష్ప3లో కూడా చూపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా, భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్నారు.