Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా??

పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి నెలరోజులైనా ఇంకా ఆ వీడియో ఇంపాక్ట్ జనాల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే షూటింగ్ ఎక్కడ జరుగుతోంది..? ఏం సీన్స్ షూట్ చేస్తున్నారో అన్న ఇంట్రస్ట్ చూపిస్తూనే ఉన్నారు జనాలు.

Pushpa 2 : పుష్ప 2 షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా??

Pushpa 2 movie shoot happening in Maredumilli Forests

Pushpa 2 :  పుష్ప(Pushpa) సినిమాతో బన్ని(Bunny), సుకుమార్(Sukumar) దేశమంతటా ప్రేక్షకులని మాయ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలో పాటలు, డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి నెలరోజులైనా ఇంకా ఆ వీడియో ఇంపాక్ట్ జనాల్లో కంటిన్యూ అవుతూనే ఉంది. అందుకే షూటింగ్ ఎక్కడ జరుగుతోంది..? ఏం సీన్స్ షూట్ చేస్తున్నారో అన్న ఇంట్రస్ట్ చూపిస్తూనే ఉన్నారు జనాలు.

పుష్ప 2 షూటింగ్ ప్రస్తుతం ఏపీలోని అల్లూరి జిల్లాలో ఉన్న మారేడుమిల్లి ఫారెస్ట్ లో, ఆ దగ్గర్లో ఉన్న మోతుగూడెం గ్రామంలో జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ యూనిట్ తో పాటు తండా జనాలు కూడా తెగ హడావిడి చేస్తున్నారు. సుకుమార్ అండ్ టీమ్ తో పాటు మెయిన్ టెక్నికల్ టీమ్ మొత్తం అక్కడే ఉన్నారు. పుష్ప తో జస్ట్ శాంపిల్ చూపించానంటున్న సుకుమార్ సెకండ్ పార్ట్ లో బన్నీ విశ్వరూపంచూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. సినిమాలో 10 శాతం షూట్ కూడా కాలేదు.. అప్పుడే ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎందుకు?

పుష్ప ద రైజ్ ఫస్ట్ పార్ట్ మొత్తం జీరో నుంచి స్మగ్లర్ గా మారిన టైమ్ చూపిస్తే పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నారని సమాచారం. ఫారెన్ కంట్రీస్ లో కూడా పుష్ప తన హవా ఎలా నడిపించాడో అన్నది చూపించబోతున్నారట. ఇప్పటికే పుష్పలో మారేడ్ మిల్లి, డీప్ ఫారెస్ట్ ఇంటెన్స్ విజువల్స్ తో సినిమా ఇంటెన్సిటీ చూపించిన సుకుమార్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కూడా మారేడుమిల్లి అడవుల్లో ఇంకాస్త డెప్త్ తో చూపించబోతున్నారట. మొన్నటిదాకా వైజాగ్, రామోజీ ఫిలింసిటీలలో పుష్ప 2 షూట్ చేసిన టీం ప్రస్తుతానికి మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేస్తుంది. మరి పుష్ప 2 ఇంకెన్ని లొకేషన్స్ లో షూట్ చేస్తారో. అభిమానులు త్వరగా షూట్ చేసి సినిమాని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు.