Pushpa 2 Shooting : ఫాస్ట్ ఫాస్ట్‌గా పుష్ప 2 షూటింగ్.. సుకుమార్ భార్య స్పెషల్ పోస్ట్..

ఇటీవల పుష్ప 2 వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ అయ్యాక అల్లు అర్జున హైదరాబాద్ వచ్చేటప్పుడు ఫ్యాన్ మీట్ పెట్టి కొంతమంది ఫ్యాన్స్ ని కలిసి వారికి ఫొటోలు ఇచ్చి వచ్చాడు. దీంతో.......................

Pushpa 2 Shooting : ఫాస్ట్ ఫాస్ట్‌గా పుష్ప 2 షూటింగ్.. సుకుమార్ భార్య స్పెషల్ పోస్ట్..

Pushpa 2 Shooting first shedule completed sukumar wife tabitha post some special pics from pushpa 2 shoot location

Pushpa 2 Shooting :  ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ రిలీజైన చాలా రోజుల తర్వాత ‘పుష్ప 2’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. ‘పుష్ప’ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి నేషనల్ వైడ్ గానూ సత్తా చాటుకుంది. రిలీజైన అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి అంతకన్నా ఎక్కువ డిలే అయింది. మొత్తానికి లాస్ట్ మంత్ వైజాగ్ లో ‘పుష్ప 2’ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

అల్లు అర్జున్ , ఇతర ఆర్టిస్టులపై కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ను షూట్ చేశారు. అలాగే ఇదే షెడ్యూల్ లో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించినట్టు తెలుస్తోంది. మొత్తానికి లేట్ అయినా సూపర్ ఫాస్ట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వేగంతోనే మిగిలిన పార్ట్ కూడా షూట్ కంప్లీట్ అయితే సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవడం పక్కా. ఇక పుష్ప 2 సెకండ్ షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించబోతున్నారు అని సమాచారం.

ఇప్పటికే షూటింగ్ విషయంలో చాలా ఆలస్యం చేసిన సుకుమార్ ఇకపై ఎక్కువ బ్రేకులు లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఫిలిమ్ సిటీలోనే యూనిట్ తో ఉంటూ కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు. రామోజీ ఫిలిమ్ సిటీ నుండి రోజు ప్రయాణం చేయకుండా ఆ టైమ్ ను కూడా షూటింగ్ కోసం వాడుకునే ప్లానింగ్ లో ఉన్నాడు సుక్కు. మొత్తం మీద లేటయినా శరవేగంతో పుష్ప 2 షూటింగ్ చేయడం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.

Sridevi : శ్రీదేవి.. ది లైఫ్ అఫ్ ఏ లెజెండ్.. శ్రీదేవిపై మరో పుస్తకం..

ఇటీవల పుష్ప 2 వైజాగ్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ అయ్యాక అల్లు అర్జున హైదరాబాద్ వచ్చేటప్పుడు ఫ్యాన్ మీట్ పెట్టి కొంతమంది ఫ్యాన్స్ ని కలిసి వారికి ఫొటోలు ఇచ్చి వచ్చాడు. దీంతో బన్నీ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే షూటింగ్ లో చివరి రోజు సుకుమార్ భార్య, పిల్లలు కూడా వైజాగ్ షూట్ లొకేషన్ కి వెళ్లినట్టు సమాచారం. తాజాగా పుష్ప 2 షూటింగ్ లొకేషన్ లో సుకుమార్, సుకుమార్ భార్య తబిత, వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. Watching my man ‘master’ing his craft! అని పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, ఇయర్ ఎండింగ్ కి సినిమా రిలీజ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.