Pushpa 2: పుష్ప-2 షూటింగ్ అప్డేట్.. వైజాగ్‌లో ఏం జరుగుతుందంటే..?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-ది రైజ్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించగా, ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం క్రియేట్ చేసింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఇక ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మూవీపై పడింది.
Pushpa 2: పుష్పరాజ్‌కు లీకుల బెడద.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
దీంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ వచ్చినా దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. కాగా, ప్రస్తుతం పుష్ప-2 చిత్ర షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుండగా, హీరో అల్లు అర్జున్ ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. వైజాగ్ షెడ్యూల్‌లో ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరయోగ్రఫీ చేస్తుండగా, మరో రెండు రోజుల్లో ఈ సాంగ్ షూటింగ్ పూర్తవుతున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.
Pushpa 2 : సైలెంట్ గా మొదలుపెట్టేసిన పుష్ప 2 షూట్.. సుకుమార్ భార్య పోస్ట్ వైరల్..
బీచ్, పోర్టు బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కుతున్న ఈ ఇంట్రొడక్షన్ సాంగ్ తరువాత కొంత గ్యాప్ తీసుకుని, నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ రష్మిక మందన్న కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.