Pushpa : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి

మూడో పాటకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. 'సామి సామి' అంటూ మంచి మాస్ బీట్ లో ఉందని ప్రోమోలోనే అర్థమైంది. తాజాగా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Pushpa : ‘సామి సామి’ అంటూ పుష్పరాజ్ తో చిందేసిన శ్రీవల్లి

Saami Saami

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ హీరోగా ‘పుష్ప’ సినిమాతో రాబోతున్నాడు. అభిమానులతో పాటు చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పక్కా విలేజ్ మాస్ క్యారెక్టర్ లో కనపడబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది. ‘పుష్ప’ మొదటి పార్ట్ ని డిసెంబర్ 17న రిలీజ్ చేస్తామని కూడా ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలని పెంచింది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

Sherlin Chopra : శిల్పాశెట్టి దంపతులపై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన షెర్లిన్ చోప్రా

మొదటగా ‘దాక్కో దాక్కో మేక’ అంటూ మంచి మాస్ సాంగ్ వచ్చి అందర్నీ ఊపేసింది. ఆ తర్వాత ‘శ్రీవల్లి’ అంటూ వచ్చిన మెలోడీ సాంగ్ అందరూ రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ రెండు పాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మొన్న మూడో పాటకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ‘సామి సామి’ అంటూ మంచి మాస్ బీట్ లో ఉందని ప్రోమోలోనే అర్థమైంది. తాజాగా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Bommarillu Bhaskar : మళ్ళీ మెగా కాంపౌండ్ లోకి బొమ్మరిల్లు భాస్కర్.. మెగా హీరోతో సినిమా??

ఈ పాటని మంచి మంచి లొకేషన్స్ లో అద్భుతంగా చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మంచి మాస్ బీట్ తో పాట సాగింది. అల్లు అర్జున్ మాస్ లుక్స్, రష్మిక క్యూట్ లుక్స్ ఈ పాటకి మరింత అందాన్ని తెచ్చాయి. శేఖర్ మాస్టర్ కొత్త కొత్త స్టెప్స్ వేయించారు. అంతకుముందు వచ్చిన పాటల్లాగే ఇది కూడా వైరల్ అవుతుందని తెలిసిపోతుంది. ఈ పాటతో మరోసారి ‘పుష్ప’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ‘సామి సామి’ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.