Pushpa: బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్‌గా పుష్ప!

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్. అల వైకుంఠపురం నుంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న బన్నీ..

Pushpa: బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్‌గా పుష్ప!

Pushpa

Pushpa: సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే.. ఆ స్టైల్ నే తన ట్యాగ్ లైన్ గా పెట్టుకున్నారు అల్లు అర్జున్. అల వైకుంఠపురం నుంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న బన్నీ.. ఇప్పుడిప్పుడే ఎక్స్ పెరిమెంట్స్ చేస్తూ తన వర్సెటాలిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాస్ ఫ్యాన్స్ కి బన్నీకి మించిన హీరోలేడనేలా, క్లాస్ కి అదే లెవల్లో క్లాసీనెస్ ని చూపించేలా తనను తాను మౌల్డ్ చేసుకున్న బన్నీ కెరీర్లో స్టైలిష్ క్యారెక్టర్లతోనే ఎక్కువగా ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ఫస్ట్ టైమ్ ఊరమాస్ క్యారెక్టర్లో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు.

Radhe Shyam: విజువల్ ట్రీట్.. దుమ్మురేపుతున్న సోచ్ లియా సాంగ్!

అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తూ డిసెంబర్ 17న ధియేటర్లకు వస్తున్న పుష్ప మూవీ బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ కాబోతోంది. సినిమాల విషయంలో ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా, స్టైలిష్ స్టార్ అన్న పేరు మర్చిపోయే గెటప్ లో పుష్పరాజ్ గా నెవర్ బిఫోర్ లుక్ తో, అదిరిపోయే యాక్షన్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నారు అల్లు అర్జున్. బన్నీ ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేసినా.. పుష్ప మాత్రం వాటన్నింటినీ మించి ఉండబోతోంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడూ పెద్దగా ఎక్స్ పెరిమెంట్స్ జోలికెళ్లని బన్నీ.. ఫస్ట్ టైమ్ కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు.

Shah Rukh Khan: మళ్ళీ ట్రాక్‌లోకి షారుఖ్.. ఆగిన సినిమాలు రీస్టార్ట్!

అలవైకుంఠపురం లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత సేఫ్ గా కమర్షియల్ మూవీ కాకుండా కంప్లీట్ డీ గ్లామర్ లుక్ చేసే సాహసం చేశారు బన్నీ. అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే.. బన్నీ ఇప్పటి వరకు తన సినిమాలన్నీ తెలుగులోనే రిలీజ్ చేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ పుష్పని రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తూ.. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ సౌత్ లో తెలుగుతో పాటు కన్నడ, తమిళ్ లో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. హిందీలో కూడా డబ్బింగ్ సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఈ క్రేజ్ ని క్యాష్ చేస్కోడానికి పుష్ప మూవీని డైరెక్ట్ హిందీలో రిలీజ్ చేస్తూ.. బాలీవుడ్ లో కూడా జెండా పాతడానికి రెడీ అయ్యారు.

Bigg Boss 5: నా నెత్తి మీద ఎక్కకు సిరి వెళ్ళిపో.. షణ్ముఖ్ ఫైర్ విత్ ఫైర్!

అల్లు అర్జున్ ఇప్పటి వరకూ బాలీవుడ్ లో ఎలాంటి ఎంట్రీ ఇవ్వకపోయినా.. బన్నీ అంటే బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. బన్నీ డబ్బింగ్ సినిమాలు డిజిటల్ మీడియాలో రికార్డ్స్ వ్యూస్ తో ట్రెండ్ క్రియేట్ చేశాయి. దీంతో పాటు మార్కెట్ రేంజ్ పెంచుకోడానికి, తనకున్న కమర్షియల్ స్టామినాని ప్రూవ్ చేస్కోడానికి పాన్ ఇండియా వైడ్ గా వస్తున్నాడు పుష్ప. తన కమర్షియల్ స్ట్రెన్త్ ని చెక్ చేసుకోవడానికి మంచి సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు బన్నీ. అంతేకాదు.. పాన్ ఇండియా హీరోగా తన క్రేజ్ ని పదిలం చేస్కోడానికి, ఆల్రెడీపాన్ ఇండియా రేంజ్ హీరోలకు గట్టిపోటీ ఇవ్వడానికి పెద్ద ప్లాన్లే వేసుకున్నారు ఈ మెగా హీరో.

RRR: రోజుకో వీడియో.. పూటకో పోస్టర్.. ప్రమోషన్స్ పీక్స్!

పుష్ప సినిమాని ఇండియాలోనే కాకుండా.. ఓవర్సీస్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. పుష్ప సినిమాని బన్నీ కెరీర్ లో ఎప్పుడూ లేనన్ని హ్యూజ్ ధియేటర్లలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నింటీకీ మించి అల్లు అర్జున్ యాక్టింగ్ పొటెన్షియాలిటీని ఇంకాస్త స్ట్రాంగ్ గా చూపించబోతోంది పుష్ప. యాక్టింగ్ వైజ్, క్యారెక్టర్ వైజ్, అప్పియరెన్స్ వైజ్ వేరియేషన్స్ చూపిస్తూ.. పుష్పరిలీజ్ అవ్వకముందే ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్నారు. ఇదిగో వస్తున్నాం.. అదిగో వస్తున్నాం అని ఊరిస్తూ.. ఫ్యాన్స్ లో పుష్ప ఫీవర్ తెప్పిస్తున్నారు. అంతేకాదు .. ఫహాద్ ఫాజిల్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ని తెలుగుకు ఇంట్రడ్యూస్ చేస్తూ పుష్ప రేంజ్ ని పెంచేశారు.

Raviteja: జెట్ స్పీడ్‌తో మాస్ రాజా.. నెలకో సినిమా రిలీజ్!

ఫస్ట్ సాంగ్ తోనే ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప.. అప్పటి నుంచి సాంగ్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. ఆల్బమ్ తోనే అదిరిపోయే రికార్డులు సొంతం చేసుకున్న పుష్ప.. సినిమా రిలీజ్ తో మరిన్ని రికార్డులు సాధిస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బన్నీ-సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్, ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ, కెరీర్ లో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా, మళయాళ స్టార్ ని తెలుగులో విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్న సినిమా, కంప్లీట్ డీ గ్లామర్ లుక్ తో పాటు డిఫరెంట్ యాస తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఇన్ని స్పెషాలిటీస్ తో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప మూవీ బన్నీ కెరీర్ లో డెఫినెంట్ గా బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎటువంటి డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్.