Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!

ఏ ముహూర్తాన పుష్ప రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెట్టినా.. కొన్నిచోట్ల ధియేటర్లు..

Pushpa: బర్నింగ్ కలెక్షన్లు.. బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు!

Pushpa (1)

Pushpa: ఏ ముహూర్తాన పుష్ప రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెట్టినా.. కొన్నిచోట్ల ధియేటర్లు మూసేసినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదంటోంది. రిలీజ్ అయ్యి నెల రోజుల కాకుండానే నార్త్ లో 100 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ స్టార్లు షాక్ అయ్యేలా చేస్తోంది పుష్ప.

Ghani: వరుణ్‌తో మిల్కీ బ్యూటీ.. మాస్ మసాలా ఐటెం నెంబర్!

ఇలాగే.. ఎంటర్ టైన్ మెంట్ తో ఫైర్ అంటించిన పుష్ప.. నాన్ స్టాప్ గా ధియేటర్లలో కలెక్షన్ల అగ్గి రాజేస్తూనే ఉంది. అందుకే బర్నింగ్ కలెక్షన్లతో దూసుకుపోతూ బాలీవుడ్ స్టార్లు బెంబేలెత్తే రికార్డులు క్రియేట్ చేస్తోంది. సరిగ్గా 25 రోజుల క్రితం పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన పుష్ప నార్త్ బెల్ట్ లో సోలోగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన 5వ సౌత్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప.

Boyapati-Pawan: బోయపాటితో పవర్ స్టార్.. ఇది సెట్టయ్యే కాంబినేషనేనా?

పాన్ ఇండియా సినిమా అని ఫస్ట్ నుంచి చెబుతున్నా.. సౌత్ లో చేసినంత ప్రమోషన్లు బాలీవుడ్ లో పుష్ప టీమ్ చెయ్యలేదనే చెప్పాలి. కానీ సినిమాలో దమ్మున్నప్పుడు.. దూసుకుపోతుందన్న కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేసిన బన్నీ అండ్ టీమ్.. ఇప్పుడు జస్ట్ 25 రోజుల్లో 100 కోట్ల కలెక్షన్లను ఓన్లీ బాలీవుడ్ లోనే రాబట్టారు. రిలీజ్ అయినప్పటినుంచి బాలీవుడ్ లో దూకుడు చూపిస్తోన్న పుష్ప.. రిలీజ్ కు నెలరోజులు దగ్గరపడుతున్నా.. ఇంకా కాన్ స్టంట్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతోంది.

Siddharth-Saina Nehwal: సైనాకు సిద్దార్థ్ క్షమాపణ.. వివాదం ముగిసినట్లేనా?

బాలీవుడ్ లో 83, స్పైడర్ మ్యాన్ లాంటి హైలీ కాంపిటీటివ్ సినిమాలను కూడా దాటుకుని ఈ కలెక్షన్లను సాధించగలిగింది పుష్ప. ఇప్పటికే 325 కోట్ల కలెక్షన్లతో తగ్గేదే లేదంటోంది పుష్ప. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పుష్ప హిందీ వర్షన్ ని జనవరి 14న రిలీజ్ చెయ్యబోతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు, క్రికెటర్లు ఇలా ప్రతి ఒక్కరూ పుష్ప మూవీ చూసి సోషల్ మీడియాలో తెగ మెచ్చుకుంటున్నారు. అయితే.. ఫస్ట్ పాన్ ఇండియా మూవీతోనే బాలీవుడ్ లో ఇంత ఇంపాక్ట్ చూపించి.. కోవిడ్ టైమ్ లో కూడా కలెక్షన్లతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పుష్ప.