Pushpa: రెండో రోజు అదే వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని ఐకాన్ జోరు!

పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి రెండవ రోజు భారీ వసూళ్లు దక్కించుకుంది. తొలిరోజు రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపిన పుష్ప ది రైజ్.. 2021లో

Pushpa: రెండో రోజు అదే వసూళ్లు.. బాక్సాఫీస్ దగ్గర తగ్గని ఐకాన్ జోరు!

Allu Arjun Pushpa

Pushpa: పుష్ప మేనియా కొనసాగుతుంది. ఐకాన్ స్టార్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి రెండవ రోజు భారీ వసూళ్లు దక్కించుకుంది. తొలిరోజు రిమార్కబుల్ ఓపెనింగ్స్ తో దుమ్మురేపిన పుష్ప ది రైజ్.. 2021లో సాలిడ్ హిట్ కొట్టిన సినిమాగా నిలిచింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ నంబర్ వన్ పొజిషన్ లో కూర్చున్నాడు పుష్పరాజ్. తొలిరోజు 63కోట్లకు పైగా వసూళ్లతో రికార్డ్ సృష్టించిన ఐకాన్ స్టార్.. నైజాం ఏరియాలో పదకొండున్నర కోట్ల వసూళ్లతో టాప్ 1 ప్లేస్ కి రీచయ్యాడు.

Bheemla Nayak: సంక్రాంతికి రావాలా వద్దా.. చర్చిస్తున్న మేకర్స్?

తొలిరోజు లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 25 కోట్లను క్రాస్ చేసిన పుష్ప రెండవ రోజు కూడా అదే మేనియాను కొనసాగించినట్లు తెలుస్తుంది. ఒక్క నైజాం ఏరియాలోని రెండో రోజు పుష్ప 6.5 కోట్ల షేర్ ని రాబట్టినట్లు ట్రేడ్ పండితుల ప్రాధమిక లెక్కలు చెప్తున్నాయి. వారాంతం కావడం.. మరోసినిమా ఏదీ పోటీలో లెక్కపోవడంతో మరో రెండు రోజులు అదిరే వసూళ్లు ఈ చిత్రం అందుకోవడం పక్కా అని చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తే పుష్ప భారీ వసూళ్ల ఫిగర్ న చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.

RRR: ముంబైలో బ్లాస్టింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. సర్వం సిద్ధం!

నిజానికి సినిమాకి మిక్సెడ్ రివ్వ్యూలు వచ్చినా అల్లు అర్జున్ నటన, డెడికేషన్ కి మాత్రం సూపర్ అప్లాజ్ వచ్చింది. అందుకే ప్రేక్షకులు ఒక్కసారి అయినా సినిమా చూసేందుకు థియేటర్లవైపు వెళ్తున్నారు. పైగా యూనిట్ సినిమా విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ ఆపడం లేదు. దీంతో సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందివ్వగా సుకుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు రెండు భాగాలుగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.