Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ లీక్!

ఎన్నో అంచనాల మధ్య రీలీజ్ అయిన పుష్ప- ది రైజ్ సినిమా అభిమానులను ఆకట్టుకుంది.

Pushpa: పుష్ప సెకండ్ పార్ట్ టైటిల్ లీక్!

Pushpa

Pushpa: ఎన్నో అంచనాల మధ్య రీలీజ్ అయిన పుష్ప- ది రైజ్ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్‌ అల‍్లు అర్జున్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రైజ్’ ఫస్ట్ పార్ట్ కాగా.. సెకండ్ పార్ట్‌కు సంబందించిన టైటిల్ లీక్ అయ్యింది.

పుష్ప ది రైజ్ మూవీ ఎండింగ్‌లో సెకండ్ పార్ట్ పేరును దర్శకుడు సుకుమార్ రివీల్ చేశాడు. సెకండ్ పార్ట్‌కు ‘పుష్ప-ది రూల్’ అనే టైటిల్ పెట్టారు. పుష్ప ది రైజ్‌లో అల్లూ అర్జున్ నటన ఆకట్టుకుంది అనే అభిప్రాయం వ్యక్తం అవగా.. సెకండ్‌ పార్ట్‌లో ఏమేరకు రూలింగ్‌ చేస్తాడో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించగా.. రష్మిక మందన్నా పల్లెటూరి యువతి పాత్రలో నటించింది. స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా సాగింది.