Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ పక్కా కమర్షియల్....

Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?

Pushpa Part 2 To Take Off From July End

Pushpa: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా తీర్చిదిద్దడంతో, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా కేవలం సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా అదిరిపోయే సక్సెస్‌ను సాధించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సీక్వెల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Pushpa 2: పుష్ప 2 కోసం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న సుకుమార్?

అయితే పుష్ప పార్ట్ 2 చిత్రాన్ని జూన్ లేదా జూలై నెలలో పట్టాలెక్కించాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ.. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమాను ఇంకా స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో స్టార్ట్ అవుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ సినిమాను జూలై చివరి వారంలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.

Pushpa2: పుష్ప సీక్వెల్ విషయంలో తగ్గేదే లే అంటోన్న సుకుమార్!

చిత్ర నిర్మాతలు చెబుతున్న వివరాల ప్రకారం జూలైలో ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను పట్టాలెక్కించడం ఖాయమని తెలుస్తోంది. అంతేగాక, వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసేందుకు కూడా వారు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా బడ్జెట్ ఈసారి మరింతగా పెరగనుందని, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కించడంలో ఎక్కడా కాంప్రమైజ్ కాబోమని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సినిమాలో మరోసారి బన్నీ తన విశ్వరూపాన్ని చూపించనుండగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా మరోసారి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు బలంగా మారనుంది. మరి ఈ సినిమాను ఈసారైనా అనుకున్నట్లుగా లాంఛ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.