Allu Arjun: బిగ్‌బాస్‌లోకి ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్

ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్.. పాన్ ఇండియన్ సినిమా పుష్పతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నారు.

10TV Telugu News

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్.. పాన్ ఇండియన్ సినిమా పుష్పతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నారు. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా విడుదల కానుండగా.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్‌లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండవ పార్ట్ షూటింగ్‌ పూర్తి చేసేపనిలో ఉన్న అల్లూ అర్జున్.. వెంటనే బాలీవుడ్‌లో ప్రమోషన్స్‌ మొదలు పెట్టనున్నారు. బాలీవుడ్‌లో క్రేజీ షో బిగ్‌బాస్‌కు కూడా అల్లూ అర్జున్ వెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది.

పాన్‌ ఇండియా లెవల్లో సినిమాను ప్రమోట్‌ చేసేందుకు.. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్‌ 15వ సీజన్‌లో బన్నీ స్పెషల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. పుష్ప ప్రమోషన్స్‌లో భాగంగా బన్నీ బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టనున్నారు. అల్లూ అర్జున్, సల్మాన్‌ ఖాన్‌లకు ఇప్పటికే పరిచయం ఉండగా.. బాలీవుడ్‌లో బన్నీ ఎంట్రీ గ్రాండ్‌గా ఇచ్చేందుకు బిగ్‌బాస్ ఒక వేదిక అవ్వనుందని చెబుతున్నారు.

అల్లూ అర్జున్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో విడుదలవ్వగా.. వాటికి కోట్లలో వ్యూస్ ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో కూడా బన్నీకి గ్రాండ్ వెల్‌కమ్ ఉంటుందని భావిస్తున్నారు. బన్నీకి తెలుగుతో పాటూ మలయాళంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.

×