Akhanda : ‘అఖండ’ వేదికపై ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్

ఈ సినిమా ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా వస్తున్నారు. వీళ్ళిద్దరూ రావడంతో ఈ ఫంక్షన్ లోనే 'అఖండ' సినిమాతో.......

Akhanda : ‘అఖండ’ వేదికపై ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్
ad

Akhanda :  ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి హిట్ సినిమాల తర్వాత బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘అఖండ’. ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు.

Chiranjeevi : చిరంజీవి ట్వీట్‌పై పేర్ని నాని.. బిజీగా ఉన్నాం.. తర్వాత చూద్దాం

అయితే ఈ సినిమా ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా వస్తున్నారు. దీంతో ఈ ఫంక్షన్ కి బాగా క్రేజ్ వచ్చింది. ప్రేక్షకులు, అభిమానులు ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ రావడంతో ఈ ఫంక్షన్ లోనే ‘అఖండ’ సినిమాతో పాటు ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ కూడా చేసే ప్లాన్ లో ఉన్నారు.

Akhanda : ఒకపక్క అల్లు అర్జున్.. మరో పక్క రాజమౌళి.. గట్టిగానే ప్లాన్ చేసిన బాలయ్య

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ అవ్వనుంది. దాంతో అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నాడు. ఇటీవల అన్ని ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్లి పుష్ప సినిమా ప్రమోషన్స్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇక బాలయ్య ఆహాలో ‘అన్ స్టాపబుల్’ షో చేస్తున్నడు. దీంతో అల్లు వారి ఫ్యామిలీతో ఉన్న స్నేహం బలపడటంతో ఆహాని కూడా ఈ వేదికపై ప్రమోట్ చేయడానికే అల్లు అర్జున్ వస్తున్నట్టు సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ అన్ని వేడుకల్ని తన ప్రమోషన్స్ కోసం వాడేసుకుంటున్నారు.

Prabhas : డిసెంబర్‌ నుంచి ‘ప్రాజెక్టు K’ చిత్రీకరణ.. జెట్‌స్పీడ్‌లో ప్రభాస్

ఇక పాన్ ఇండియా సినిమా ‘ఆర్ఆర్ఆర్’ జనవరిలో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా చేస్తున్నారు. తాజాగా ‘అఖండ’ ప్రి రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి గెస్ట్ గా రానుండటంతో ఈ వేదికపై కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ చేయనున్నారు. అల్లు అర్జున్ అభిమానులు, బాలయ్య అభిమానులు కూడా ఈ ఫంక్షన్ కి వస్తారు కాబట్టి ఇలాంటి వేదిక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని వేరే హీరోల అభిమానులకు దగ్గర చేస్తుందని రాజమౌళి ఈ ఫంక్షన్ కి గెస్ట్ గా వస్తున్నారు. వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికి ఒకే వేదికపై మూడు సినిమాలు ప్రమోషన్ అవుతున్నాయి.