Pushpa : వెయ్యి మంది డ్యాన్సర్లతో పుష్ప స్పెషల్ సాంగ్

ఈ చిత్రంలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా 'పుష్ప' సినిమాలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ

Pushpa : వెయ్యి మంది డ్యాన్సర్లతో పుష్ప స్పెషల్ సాంగ్

Pushpa (1)

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా గ్యాప్ తర్వాత ‘పుష్ప’ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనపడనున్నాడు. ‘రంగస్థలం’ లాంటి పక్కా మాస్ సినిమా తీసిన తర్వాత డైరెక్టర్ సుకుమార్ అల్లుఅర్జున్ తో హ్యాట్రిక్ కొట్టడానికి మూడో సినిమాగా ‘పుష్ప’ని సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప’ మొదటి భాగం డిసెంబర్ 17న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలని పెంచింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలని రిలీజ్ చేశారు. దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాట‌లు బాగా వైరల్ అయ్యాయి. జనాల నుంచి విపరీతమైన స్పందన లభించింది. తాజాగా ‘పుష్ప’ సినిమా నుంచి మరో అప్ డేట్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Mohan Babu : చిరంజీవి మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టే బాగున్నాడు: మోహన్ బాబు

ఈ చిత్రంలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ‘పుష్ప’ సినిమాలో వెయ్యి మంది డ్యాన్సర్లతో ఓ పాటని చిత్రీకరించనున్నారు. వీళ్ళ మధ్యలో అల్లు అర్జున్ స్పెషల్ గా కనిపించబోతున్నారు. ఈ న్యూస్ కి సంబంధించి షూట్ లొకేషన్ లోని ఓ వర్కింగ్ స్టిల్ ని కూడా చిత్ర బృందం విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.