Pushpa : రష్యాలో పుష్ప టీమ్ సందడి..

'ఆర్ఆర్ఆర్' హిట్టు తరువాత రాజమౌళి ఆచరించిన పద్ధతినే, టాలీవుడ్ లెక్కల మస్టర్ సుకుమార్ కూడా అనుసరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ పుష్ప ని రష్యాలో దుబ్ చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అనుకోని రీతిలో వచ్చిన పుష్ప-1 క్రేజ్ ని 'పుష్ప-2' కలిసొచ్చేలా మార్చుకుంటున్నాడు.

Pushpa : రష్యాలో పుష్ప టీమ్ సందడి..

Pushpa team interacts with russia media

Pushpa : ‘ఆర్ఆర్ఆర్’ హిట్టు తరువాత రాజమౌళి ఆచరించిన పద్ధతినే, టాలీవుడ్ లెక్కల మస్టర్ సుకుమార్ కూడా అనుసరిస్తున్నాడు. ఇప్పటికే తమ మార్కెట్ ని టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్ వరకు విస్తరించుకున్న ఈ ఇద్దరు దర్శకులు. తరువాత వచ్చే తమ తదుపరి ప్రాజెక్ట్ లు కోసం ఇంటర్నేషనల్ లెవెల్ లో మార్కెట్ ని క్రియేట్ చేసే పనిలో పడ్డారు.

Pushpa : నార్త్‌లోను ‘పుష్ప’దే హవా.. మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లిస్ట్ విడుదల చేసిన ఆర్మాక్స్ మీడియా..

ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ పుష్ప ని రష్యాలో దుబ్ చేసి విడుదలకు సిద్ధం చేశాడు. అనుకోని రీతిలో వచ్చిన పుష్ప-1 క్రేజ్ ని ‘పుష్ప-2’ కలిసొచ్చేలా మార్చుకుంటున్నాడు ఈ లెక్కల మాస్టర్. డిసెంబర్ 8న రష్యాలో గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీమియర్ షోలు డిసెంబర్ 1, 3 తేదీల్లో వేయనున్నారు. దీంతో చిత్ర యూనిట్ నేడు రష్యా చేరుకున్నారు.

ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. రష్యా మీడియా విలేకర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, హీరోహీరోయిన్లు అల్లు అర్జున్, రష్మిక మందాన పాల్గొన్నారు. కాగా యూరోప్ లో దాదాపు 175 పైగా ఇండియన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘4 సీజన్స్ క్రియేషన్స్’ ఈ సినిమాను విడుదల చేస్తుంది.