Pushpa : ‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్.. పాట రిలీజ్ ఆ రోజే

మొదటగా 'దాక్కో దాక్కో మేక' అంటూ మంచి మాస్ సాంగ్ వచ్చి అందర్నీ ఊపేసింది. ఆ తర్వాత 'శ్రీవల్లి' అంటూ వచ్చిన మెలోడీ సాంగ్ అందరూ రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ రెండు పాటలు కూడా బాగా

Pushpa : ‘సామి సామి’ అంటూ రష్మికతో మాస్ సాంగ్ పాడించిన పుష్ప రాజ్.. పాట రిలీజ్ ఆ రోజే

Pushpa

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పుష్ప’. అభిమానులతో పాటు చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ పక్కా విలేజ్ మాస్ క్యారెక్టర్ లో కనపడబోతున్నాడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయింది అని సమాచారం. మొదటి పార్ట్ ని డిసెంబర్ 17న రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ భారీ అంచనాలని పెంచింది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

Puri Jagannadh : ముంబైలో పూరితో సెల్ఫీ లేదని బాధపడిన ఇంటర్ కుర్రాడు.. వీడియో షేర్ చేసిన ఛార్మి

మొదటగా ‘దాక్కో దాక్కో మేక’ అంటూ మంచి మాస్ సాంగ్ వచ్చి అందర్నీ ఊపేసింది. ఆ తర్వాత ‘శ్రీవల్లి’ అంటూ వచ్చిన మెలోడీ సాంగ్ అందరూ రిపీట్ మోడ్ లో వింటున్నారు. ఈ రెండు పాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. తాజాగా మూడో పాటకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ‘శ్రీవల్లి’ పాట పుష్పరాజ్ శ్రీవల్లి కోసం పాడితే ఇప్పుడు రిలీజ్ అయిన పాట శ్రీవల్లి పుష్పరాజ్ కోసం పాడినట్టు ఉంది.

Mehaboob Dilse : సొంతిల్లు కట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. మీ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..

‘నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్ని అయిపోయినట్టుందిరా సామి నా సామి.. నిన్ను సామి సామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కగా ఉంది రా సామి’ అంటూ ఈ సాంగ్ ప్రోమో సాగింది. మంచి మాస్ బీట్ తో ఈ పాట ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది. ఫుల్ సాంగ్ ని ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ప్రకటించారు. అభిమానులు ఈ మాస్ సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.