Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. దుబాయ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

బన్నీ అభిమానులంతా ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు చిత్ర బృందం. 'పుష్ప' సినిమా ట్రైలర్ ని.......

10TV Telugu News

Pushpa :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబ‌ర్ 17న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.

Salman Khan – Katrina Kaif: వైరల్‌గా మారిన సల్మాన్ – కత్రినాల పెళ్లి వీడియో

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్, దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. బన్నీ అభిమానులంతా ఈ సినిమా ట్రైల‌ర్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించారు చిత్ర బృందం. ‘పుష్ప’ సినిమా ట్రైలర్ ని డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేయనున్నట్లు ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘పుష్ప’ ట్రైల‌ర్ రిలీజ్ వేడుకని దుబాయ్‌లో గ్రాండ్ గా జర‌ప‌నున్నార‌ని స‌మాచారం. ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడంతో అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాక ఈ ట్రైలర్ ని అఖండ సినిమా రిలీజ్ అయిన థియేటర్స్ లో కూడా వేసి ప్రమోట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

×