Pushpaka Vimanam: మహబూబ్‌నగర్‌లో స్పెషల్ ప్రీమియర్ షో మీ కోసమే: రౌడీ హీరో

ఇటీవల మహబూబ్ నగర్ లో నా ఏవిడి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాను. ఒక్కరోజు ముందే నవంబర్ 11న మహబూబ్ నగర్ ఏవిడి సినిమాస్ లో 'పుష్పక విమానం' ప్రీమియర్ షో వేస్తున్నాను మీ కోసమే. బుక్ మై షో

Pushpaka Vimanam: మహబూబ్‌నగర్‌లో స్పెషల్ ప్రీమియర్ షో మీ కోసమే: రౌడీ హీరో

Avd

Pushpaka Vimanam :  విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ సినిమా నవంబర్ 12న రిలీజ్ అవ్వనుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ చాలా వేగంగా చేస్తున్నారు. ఈ సినిమాని విజయ్ దేవరకొండ సొంత ప్రొడక్షన్ లో నిర్మించడంతో అన్నీ తానై ప్రమోషన్స్ దగ్గరుండి మరీ చేస్తూ తమ్ముడికి సపోర్ట్ గా నిలుస్తున్నాడు. నిన్న రాత్రి ‘పుష్పక విమానం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో భారీగా జరిగింది.

BiggBoss 5 : బిగ్ బాస్ విశ్వకి 9 వారాలకి భారీ రెమ్యునరేషన్

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీరు మా మీద చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ వల్లే ఇవాళ ఇక్కడున్నాం. ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది చాలా కష్టమైన విషయం. ఇవాళ స్టేజి మీద ఇంతమంది యంగ్ టాలెంట్ సంతోషంగా తమ సినిమా గురించి మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్లను ఎంకరేజ్ చేసేందుకు ప్రొడక్షన్ లో కష్టాలు పడిన పర్వాలేదు అనిపిస్తోంది. నేను ఏదైనా అనుకుంటే ఆ పనిచేసేందుకు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తాను. మీ అభిమానం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ‘పుష్పక విమానం’ ప్రీ రిలీజ్ వేడుకను వైజాగ్ కి తీసుకొచ్చాము. సినిమా చాలా బాగుంటుంది. మీరంతా చూడండి అని అన్నాడు.

Akshay Kumar : అక్షయ కుమార్ సినిమాకి పంజాబ్ రైతుల సెగ

మీ అభిమానం ఎప్పుడూ కావాలని నేను కోరుకుంటాను. మీకు మంచి సినిమాలు, కొత్త తరహా చిత్రాలు అందివ్వాలనేదే నా జీవిత ఆశయం. ఇటీవల మహబూబ్ నగర్ లో నా ఏవిడి మల్టీప్లెక్స్ స్టార్ట్ చేశాను. ఒక్కరోజు ముందే నవంబర్ 11న మహబూబ్ నగర్ ఏవిడి సినిమాస్ లో ‘పుష్పక విమానం’ ప్రీమియర్ షో వేస్తున్నాను మీ కోసమే. బుక్ మై షో లో టికెట్స్ బుక్ చేసుకోండి. ప్రీమియర్ షోలో కలుద్దాం నేను కూడా వస్తాను అని అన్నారు.