Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

ఇటీవల తెలుగు సినిమాలని బాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపు 20కి పైగా తెలుగు సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ సంస్థలు దక్కించుకున్నాయి.

Pushpaka Vimanam : బాలీవుడ్‌లోకి ‘పుష్పక విమానం’

Pushpaka Vimanam

Pushpaka Vimanam :  ఇటీవల తెలుగు సినిమాలని బాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపు 20కి పైగా తెలుగు సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక్కడ హిట్ అయిన ప్రతి సినిమా, అంతే కాకుండా సినిమా ప్లాప్ అయినా కథ కొత్తగా ఉంటే ఆ సినిమాల రైట్స్ కూడా ఎగబడి కొనుక్కుంటున్నాయి బాలీవుడ్ నిర్మాణ సంస్థలు. దీంతో పాటు ఆ సినిమాని అక్కడ రీమేక్ చేయడానికి ఎక్కువగా మన తెలుగు డైరెక్టర్స్ కే ఛాన్స్ ఇస్తున్నారు. దీంతో మన తెలుగు డైరెక్టర్స్ కూడా బాలీవుడ్ లో జెండా ఎగరేస్తున్నారు. తాజాగా మరో తెలుగు సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ కొనుక్కోవడానికి సిద్ధమైపోయింది.

Rajinikanth : ‘అన్నాత్తే’ స్టోరీ విని ఏడ్చేశాను : రజినీకాంత్

ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ సినిమాని విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ లోనే నిర్మించడం విశేషం. ఈ సినిమా కొత్తరకం కామెడీ, మిస్టరీ కథతో వచ్చినా థియేటర్స్ లో జనాల ఆదరణ పొందలేకపోయింది. ఇంకా పెట్టిన బడ్జెట్ కూడా రాలేదు ఈ సినిమాకి. తెలుగులో ఇది బిలో యావరేజ్ చిత్రంగానే నిలిచింది. అయినా ఈ సినిమా హిందీ రీమేక్‌ రైట్స్‌ కోసం మంచి డిమాండ్‌ ఏర్పడిందని ఈ సినిమా టీం చెప్తున్నారు.

Bigg Boss 5 : యాని మాస్టర్‌కి సపోర్ట్‌గా మోనాల్.. ఆమె గురించి నాకు తెలుసు

బాలీవుడ్‌ నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రం రీమేక్‌ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు అని సమాచారం. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి వున్న ఈ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయం సాధిస్తుందని అక్కడి నిర్మాతలు భావిస్తున్నారు. ఈ రీమేక్‌ హక్కులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని ఈ సినిమా ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అనురాగ్‌ పర్వతనేని తెలిపారు. మరి ఈ సినిమాని హిందీలో డైరెక్ట్ చేసే ఛాన్స్ పుష్పక విమానం సినిమా డైరెక్టర్ దామోదరకే ఇస్తారా లేదా అక్కడ ఎవరినైనా తీసుకుంటారా చూడాలి.