PVR Cinemas : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.99 లకే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్..

పండగ వచ్చినా, సంతోషం వచ్చినా.. దానిని సినిమాకి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం అందరికి అలవాటు అయ్యిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన టికెట్ ధరల వల్ల ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారందరికీ ఒక గుడ్ న్యూస్. కేవలం వంద రూపాయిలో సినిమా చూసే అవకాశం వస్తుంది. అది కూడా అన్ని సదుపాయాలు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లో. నిజం అండి ఇది అబద్దం కాదు.

PVR Cinemas : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.99 లకే మల్టీప్లెక్స్ లో సినిమా టికెట్..

PVR Cinemas

PVR Cinemas : పండగ వచ్చినా, సంతోషం వచ్చినా.. దానిని సినిమాకి వెళ్లి సెలెబ్రేట్ చేసుకోవడం అందరికి అలవాటు అయ్యిపోయింది. అయితే ఈ మధ్య కాలంలో పెరిగిన టికెట్ ధరల వల్ల ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే వారందరికీ ఒక గుడ్ న్యూస్. కేవలం వంద రూపాయిలో సినిమా చూసే అవకాశం వస్తుంది. అది కూడా అన్ని సదుపాయాలు ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ లో. నిజం అండి ఇది అబద్దం కాదు.

Jailer Movie: జైలర్ మూవీలో జాయిన్ అయిన మంగళం శ్రీను!

ప్రముఖ సినిమా థియేటర్ సంస్థ అయిన పివిఆర్ సినిమాస్ ఈ అవకాశం కలిపిస్తుంది. అయితే అది కేవలం ఒక్క రోజు మాత్రమే. ఫిబ్రవరి 20 సినిమా ప్రియుల దినోత్సవం రోజున పివిఆర్ సినిమాస్ ఈ ఆఫర్ కలిపిస్తుంది. ఆ రోజున ఏ సినిమా అయిన కేవలం రూ.99 లకే చూడవచ్చు. అయితే దీనికి జిఎస్టి ఛార్జీలు అదనంగా పడనున్నాయి. అలాగే ఈ ఆఫర్ అన్ని పివిఆర్ థియేటర్స్ లో కాదు. కేవలం కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ లో మాత్రమే ఈ అవకాశం.

ఇక ఆ ప్రాంతాలు విషయానికి వస్తే.. పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్, చండీఘడ్ తో పాటు పుదుచ్చేరి సిటీస్ లో ఈ ఆఫర్ వర్తించదు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండగా, టికెట్ ధర జిఎస్టి ఛార్జీలతో కలుపుకొని రూ.100 పైన ఉండనుంది. అలాగే తెలంగాణలో జిఎస్టి ఛార్జీలతో కలుపుకొని టికెట్ ధర సుమారు రూ.112 పైన ఉండనుంది. అయితే ఈ ఆఫర్ ప్రీమియం క్యాటగిరీ సీట్స్ కి వర్తించదు అంటూ యాజమాన్యం తెలియజేసింది. కాగా ప్రస్తుతం కొత్త సినిమా రిలీజ్ చూసుకుంటే.. జనవరి 25న షారుఖ్ పఠాన్ తప్ప మధ్యలో మరో పెద్ద సినిమా లేదు. దీంతో ఈ ఆఫర్ లో సినిమా చూడాలి అంటే ప్రస్తుతం థియేటర్ లో రన్ అవుతున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెంగింపు చిత్రాలే. ఒకవేళ ఎవరైనా ఇప్పటికి ఈ సినిమాలు చూడని వారు ఉంటే, ఆ రోజు వరకు వెయిట్ చేసి అప్పుడు చూసేయండి.