Telugu Actors: క్విక్ షూట్.. హై రెమ్యునరేషన్.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!

కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. తక్కువ సమయం - ఎక్కువ రాబడి...ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్. ఇన్నిరోజులు డేట్స్ ఇస్తాం... మాకింత కావాల్సిందే అని ఖరాకండిగా..

Telugu Actors: క్విక్ షూట్.. హై రెమ్యునరేషన్.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!

Telugu Actors

Telugu Actors: కొత్త ఫార్ములాను ఫాలో అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. తక్కువ సమయం – ఎక్కువ రాబడి…ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్. ఇన్నిరోజులు డేట్స్ ఇస్తాం… మాకింత కావాల్సిందే అని ఖరాకండిగా చెప్పేస్తున్నారు. సీనియర్ స్టార్స్ నుంచి స్టార్ట్ చేస్తే యంగ్ హీరోల వరకు ఈ లెక్కల మీదే బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్నారు. కొవిడ్ పాండెమిక్ తో థియేట్రికల్ రన్ కేవలం వారం రోజులకే పరిమితమైపోయింది. పాజిటివ్ టాక్ వస్తే ఓకే.. లేదంటే నెక్ట్స్ వీక్ ఇంకో సినిమా చూసుకుందాంలే అన్నట్టు తయారయ్యారు ఆడియెన్స్. అయినా సరే తగ్గేదే లే అన్నట్టు దూసుకుపోతున్నారు మన టాలీవుడ్ స్టార్స్.

Pushpa: బన్నీ మేనియా.. కేరళలో స్పెషల్ షోస్ బుకింగ్ స్టార్ట్!

బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ మన హీరోలు హైయెస్ట్ రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. అదీ లిమిటెడ్ డేట్స్ కి మాత్రమే. గ్లోబల్ స్టార్ ప్రభాస్ దగ్గరి నుంచి సోషల్ మీడియా తోపు సూపర్ స్టార్ వరకు కూడా ఇప్పుడిదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. రెమ్యూనరేషన్ ఎంత గట్టిగా తీసుకుంటున్నారో.. అంతే గట్టిగా లిమిటెడ్ టైమ్ లో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని మేకర్స్ కి చెప్తున్నారు. సినిమా పూర్తికి లేట్ అయినా.. ఆ సినిమాలో తమ పార్ట్ నైతే ముందు కంప్లీట్ చేయాలని కండీషన్ పెట్టేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడంటే ఈ కొత్త లెక్కలే కారణం.

Payal Rajput: సొగసు చూడతరమా.. పాయల్ అందాన్ని పొగడతరమా!

సీనియర్ స్టార్ మెగాస్టార్ నే తీసుకుంటే నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రస్తుతం 3 ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా మారారు. ఎంతలేదన్నా వచ్చే ఏడాది చిరంజీవి 3 సినిమాలు థియేటర్స్ కి వచ్చేస్తాయి. ఒక్కో సినిమాకు 60 రోజుల డేట్స్ అడ్జస్ట్ చేస్తున్న చిరూ.. ఆ 60 రోజులకు 60 కోట్లు రాబడుతున్నారు. అన్నయ్యకు తగ్గ తమ్ముడు అనిపించుకుంటున్నారు పవన్ కల్యాణ్. సేమ్ బిగ్ బ్రదర్ స్ట్రాటజీనే అప్లై చేస్తున్నారు. ఒక్కో సినిమాను 50 రోజుల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెడ్తోన్న పవర్ స్టార్.. ఆ 50రోజులకు గానూ 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే మెగాస్టార్ లాగానే పవర్ స్టార్ తో సినిమా చేయాలంటే రోజుకి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటున్నారు.

Bollywood Film Releases: వారానికో సినిమా.. కాస్కో అంటోంది బాలీవుడ్!

ఈమధ్యే ఒక్కో సినిమాకు తన రేట్ ను 18కోట్లకు పెంచారు మాస్ రాజా రవితేజ. రీసెంట్ గా సుధీర్ వర్మ డైరెక్షన్లో ప్రకటించిన రావణాసుర మూవీకి కేవలం 30రోజులే కేటాయించారు. అంటే రావణాసురలోని మాస్ రాజా పార్ట్ ను ఆ 30 రోజుల్లోనే పూర్తి చేయాలి సుధీర్ వర్మ. ఈ కొత్త కండీషన్ సూపర్ గా వర్కవుట్ అవుతోంది రవితేజకి. ఖిలాడి తర్వాత ధమాకా, రామా రావ్ ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావాణాసుర సినిమాలను ఈ లెక్కల మీదే ఫటాఫట్ కంప్లీట్ చేస్తున్నారు మాస్ రాజా.

Krithi Shetty: లిప్‌లాక్ ఒకే.. బేబమ్మ హద్దులు చెరిపేసిందా?

నాని కూడా ఫుల్ స్పీడ్ తో సినిమాలు పూర్తి చేసి పక్కనపెట్టేస్తున్నాడు. అయితే నానికి ఫస్ట్ నుంచి సంవత్సానికి రెండు, మూడేసి సినిమాలు చేయడం అలవాటే. ఇప్పుడూ అంతే. శ్యామ్ సింగ రాయ్ ను చుట్టేసాడు. అంటే సుందరానికి షూటింగ్ కు డిసెంబర్ తో బైబై చెప్పేసి.. జనవరి నుంచి దసరాను పట్టాలెక్కించబోతున్నాడు. సినిమాకు మూడు నెలల చొప్పున డేట్స్ అడ్జస్ట్ చేస్తున్న నానికి శ్యామ్ సింగ రాయ్ తో గట్టి హిట్ దక్కిందంటే రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన ఆశ్చర్యం లేదు.

Heroin’s Social Media: సీనియర్ హీరోయిన్స్‌ను బీట్ చేస్తున్న యంగ్ బ్యూటీస్!

గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను వాడుకోండి మీ ఇష్టం.. కానీ తక్కువ రోజుల్లో నన్ను విడిచిపెట్టండని మేకర్స్ కి చెప్పకనే చెప్తున్నారు డార్లింగ్. అలా 60 రోజుల్లోనే ప్రిస్టీజియస్ ఫిల్మ్ ఆదిపురుష్ ను కంప్లీట్ చేసారు. ప్రశాంత్ నీల్ కిచ్చిన మూడు నెలల టైం ప్రకారం సలార్ కు త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారు. అయితే రెబల్ స్టార్ చేస్తున్నవి భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి కాస్త అటు ఇటు కావొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే లాగా. అందుకే ఎన్ని రోజులు ప్రభాస్ ను వాడుకుంటే.. ఆ లెక్క ప్రకారం పారితోషకం ముట్టజెప్పాల్సిందే. అది 100 కోట్లైనా దాటొచ్చని సమాచారం.

Bandla Ganesh: మీరు సూపర్‌ సార్‌.. చిరును తెగ పొగిడేసిన బండ్ల!

రామ్ చరణ్ కూడా ఈ సూత్రాన్ని బాగానే వంటపట్టించుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్, ఆచార్య సినిమాలను సైమల్ టేనియస్ గా పూర్తిచేసిన చరణ్…డేట్స్ ఇచ్చిన ప్రకారం శంకర్ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. జనవరి నుంచి గౌతమ్ తిన్ననూరి స్పోర్ట్స్ డ్రామాను పట్టాలెక్కించి.. అటు కొన్ని రోజులు, ఇటు కొన్ని రోజులు అడ్జస్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకు దాదాపు 35కోట్లు రెమ్యునరేషన్ చెర్రీ అందుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

Rashi Khanna: కరణ్ జోహార్ బ్యానర్‌లో రాశీ.. బంపర్ అఫర్ కొట్టేసినట్లే

జనరల్ గా కాస్త టైం ఎక్కువ తీసుకునే మహేశ్ బాబు కూడా ఈ రూట్ లోకి వచ్చేసారు. సర్కారు వారి పాటకు అనుకున్న ప్రకారం ఈ నెలాఖరున గుమ్మడికాయ కొట్టేస్తారు. ఆ వెంటనే త్రివిక్రమ్ సినిమాను ఫటాఫట్ లాగించేసి… రాజమౌళి కోసం డేట్స్ అడ్జస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే రాజమౌళి తన రెగ్యులర్ ఫార్మట్ కి భిన్నంగా మహేశ్ సినిమాను చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక మూవీని బట్టి, ఇచ్చిన డేట్స్ బట్టి మహేశ్ ఛార్జ్ 60 నుంచి 80 కోట్లు ఉంటుందంటున్నారు.

Pushpa: బాలీవుడ్ మీద పుష్పరాజ్ స్పెషల్ ఫోకస్..!

త్వరలోనే కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు తారక్. ఈ సినిమాను క్విక్ గా కంప్లీట్ చేయాలని ముందే ఒప్పందం చేసుకున్నారు. సేమ్ రూల్ ఎన్టీఆర్ నెక్ట్స్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి కూడా వర్తిస్తుంది. ఇక ఇదే బాటలో బన్నీ కూడా బోయపాటితో వర్క్ చేయబోతున్నారని సమాచారం. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 కోసం పనిచేయాల్సి ఉంది. నెక్ట్స్ వేణూశ్రీరామ్ ఐకాన్ లేదంటే ప్రశాంత్ నీల్ ఫ్లిక్ ఉండొచ్చు… లైనప్ ఏదనేది ఇంతవరకు అనౌన్స్ చేయలేదు కానీ బన్నీ కూడా క్విక్ షూట్ – హై రెమ్యునరేషన్ కండీషన్ ను అమలు చేస్తున్నారు.